సీఏఏకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన నాల్గవ రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ `పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్` గా
కోలకతా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన నాల్గవ రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ "పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్" గా వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. పౌర సత్వ సవరణ చట్టానికి ఇప్పటికే తీర్మానాలను ఆమోదించిన రాష్ట్రాలుగా కేరళ, కాంగ్రెస్ పాలిత పంజాబ్, రాజస్థాన్ లు ఉండగా, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా ఆమోదించింది.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్), ఎన్‌పిఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్)లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పునరుద్ఘాటించారు. ఈ రోజు ప్రజలు ఈ దేశం విడిచి వెళ్ళవలసి వస్తుందేమోనన్న ఆందోళనలతో భయపడుతున్నారని ఆమె అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తూ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు.
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ.. తాము సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో నిరసన తెలిపామని, త్వరలో భావసారూప్యత గల ముఖ్యమంత్రులతో సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మనవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలనుండి సీఏఏపై తీవ్రమైన నిరసనలు వ్యక్తం అయిన పరిస్థితుల్లో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా సీఏఏ కు వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని కేసిఆర్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..