Mamata Banerjee: మమత టార్గెట్ మారిందా, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన దీదీ
Mamata Banerjee: నిన్నటి వరకూ అధికార పార్టీ బీజేపీను టార్గెట్ చేసిన దీదీ ఇప్పుడు పంథా మార్చారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మరోవైపు బీజేపీపై సైతం విమర్శలు సంధించారు.
Mamata Banerjee: నిన్నటి వరకూ అధికార పార్టీ బీజేపీను టార్గెట్ చేసిన దీదీ ఇప్పుడు పంథా మార్చారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మరోవైపు బీజేపీపై సైతం విమర్శలు సంధించారు.
కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై(Narendra Modi) విరుచుకుపడుతుండే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసారి కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ బలపడటానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని నిందించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఫలితంగా మోదీ బలమైన శక్తిగా ఎదుగుతున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రచారం కోసమే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఉందన్నారు. అటు బీజేపీపై కూడా విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి(Congress Party)నిర్ణయాలు తీసుకోవడం చేతకావడం లేదని..ఫలితంగా దేశం బాధపడే పరిస్థితులు వచ్చాయని మమత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే మోదీ మరింత శక్తిమంతంగా ఎదుగుతున్నారని స్పష్టం చేశారు. ఆ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల దేశం బాధపడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగడానికి కాంగ్రెస్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ పార్టీ అందిపుచ్చుకోలేకపోయిందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటే దేశం ఎందుకు నష్టపోవాలని మమత(Mamata Banerjee) ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల(West Bengal Elections)సమయంలో తమతో జత కట్టే అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకుని వామపక్షాలతో చేతులు కలిపిందని తెలిపారు. బీజేపీతో పోరాడకుండా..కాంగ్రెస్ పార్టీ తమతో తగాదా పెట్టుకుందన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా బాగుంటుందని మమత చెప్పారు. కేంద్ర ప్రభుత్వం(Central government)చేస్తున్న దాదాగిరిని కూడా సహించే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు.
Also read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి