West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారపర్వం అధికమౌతోంది. దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్న బెంగాల్ ఎన్నికల్లో అధికార టీఎంసీ, బీజేపీ నువ్వా నేనా రీతిలో తలపడుతున్నాయి. మమతా బెనర్జీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్ ఎన్నిక (West Bengal Elections) ల్లో ప్రచారం హోరుగా సాగుతోంది. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా పశ్చిమ బెంగాల్ ఎన్నికలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. బెంగాల్ పీఠంపై మూడోసారి కూర్చోవాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే..కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ (BJP) అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ విడుదల చేసిన టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో(Manifesto) ఆకట్టుకుంటోంది.


ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్ధులకు పది లక్షల క్రెడిట్ లిమిట్, 4 శాతం వడ్డీతో క్రెడిట్ కార్డులు ఇస్తామని మమతా బెనర్డీ (Mamata Banerjee) హామీ ఇచ్చారు. అదేవిధంగా వెనుకబడిన, పేదవర్గాలకు 6 వేల నుంచి 12 వేల వరకూ కనీస వార్షికాదాయం ఉండేలా చర్యలు చేపడతామన్నారు. అధికారంలో వచ్చిన ఏడాదిలోగా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇంటింటికీ రేషన్ అందిస్తామని..ఎస్సీ, ఎస్టీలకు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ప్రతియేటా రైతులకు అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని 6 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచుతామని వాగ్దానం చేశారు. 


Also read: 7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి DA మరియు DR చెల్లింపులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook