'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు కరోనా వారియర్స్ తీవ్రస్థాయిలో  కృషి  చేస్తున్నారు.  ప్రాణాలకు తెగించి మహమ్మారితో మొదటి వరుసలో నిలబడి యుద్ధం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#coronawarriors ..వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు మీడియా సిబ్బందిని ప్రభుత్వాలు, ప్రజలు ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి. ఎందుకంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వారు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నారు. ముందు వరుసలో ఉండి కరోనా పాజిటివ్ రోగులకు సేవ చేస్తున్నారు. అందుకే ఈ రోజు వైద్యులు, వైద్య సిబ్బందికి త్రివిధ దళాలు పూలవర్షంతో అభినందించాయి. 
 
కత్తి మీద సాములా కరోనా మహమ్మారితో 24 గంటలు పోరాటం చేస్తున్న కరోనా వారియర్స్ ను ఆదుకునేందుకు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వారికి కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఆ రాష్ట్రంలో కరోనా వారియర్స్ ఆరోగ్యానికి పెద్దపీట వేసింది. కోవిడ్ 19తో పోరాటం చేస్తున్న యోధులకు 10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 


[[{"fid":"185140","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అలాగే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులకు కూడా 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. పత్రికా జర్నిలిస్టులు ఇప్పుడు కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్న జర్నలిస్టులు అంటే తనకు అపారమైన గౌరవమని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..