What is Delmicron: అల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్... ఇలా ఇప్పటివరకూ పలు కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చాయి. కరోనా వేరియంట్లు వేగంగా మ్యుటేషన్ చెందడం వల్ల ఇలా వరుసపెట్టి కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) వ్యాప్తిపై ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ఒమిక్రాన్ స్వభావం, దాని తీవ్రతను కనుగొనే ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు ఉండగానే... 'డెమిక్రాన్' భయం మొదలైపోయింది. ఇంతకీ డెమిక్రాన్ కొత్త వేరియంటా... డబ్ల్యూహెచ్ఓ (World Helath Organisation) ప్రకటన చేయకముందే ఈ పదం ఎలా ప్రచారంలోకి వచ్చింది...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డెమిక్రాన్ కొత్త వేరియంటా...:


'డెమిక్రాన్' (Delmicron) అనేది కొత్త వేరియంట్ కాదు. డెల్టా+ఒమిక్రాన్‌ను కలిపితే పుట్టిన పదమే డెమిక్రాన్. ఒకే పేషెంట్‌లో రెండు వేరియంట్లు బయటపడితే... దాన్ని సూచించేందుకు ఇలా డెమిక్రాన్ అనే పదాన్ని సృష్టించారు. మహారాష్ట్ర కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డా.శశాంక్ జోషీ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'డెల్టా, ఒమిక్రాన్ స్పైక్స్ కలగలసిన డెమిక్రాన్ ప్రస్తుతం అమెరికా, యూరోప్‌లలో సునామీ సృష్టిస్తోంది.' అని పేర్కొన్నారు. అప్పటినుంచి డెమిక్రాన్ పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అంతే తప్ప డెమిక్రాన్ అనేది కొత్త వేరియంట్ కాదు.


సాధారణంగా కరోనా వేరియంట్లకు నామకరణం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చాలా కసరత్తు చేస్తుంది. ఎన్నో సంప్రదింపులు, సమీక్షలు, శాస్త్రీయ ఆధారాలను పరిగణలోకి తీసుకున్నాకే వేరియంట్‌కు నామకరణం చేస్తుంది. ఆ పేర్లు కూడా గ్రీకు అల్ఫాబెట్‌లోనే ఉంటాయి. నిజానికి ఒమిక్రాన్ వేరియంట్‌కు (Omicron Variant) Nu లేదా Xi అనే గ్రీకు అల్ఫాబెట్స్ యాడ్ చేయాల్సి ఉంది. అయితే Nu 'న్యూ' అనే పదానిక దగ్గరగా ఉండటం... 'Xi' చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా అక్కడి చాలామందికి ఇంటి పేరుగా ఉండటంతో డబ్ల్యూహెచ్ఓ వాటిని స్కిప్ చేసింది. 


Also Read: Radhe Shyam pre-release event live: రాధే శ్యామ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ ఫుల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook