Lakhpati Didi Scheme: ఈ పథకాన్ని మొదటిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2023 ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్ ప్రసంగంలో విన్నాం. ఆ తర్వాత నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ లో భాగంగా మరోసారి ఈ పథకం గురించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన లఖ్ పతి దీదీ పథకం కింద కీలక ప్రకటన చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ మధ్యంతర బడ్జెట్ లో భాగంగా చిన్న ప్రసంగం చేశారు. ఇందులో మహిళలను ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న లఖ్‌ పతి దీదీ పథకం గురించి మాట్లాడారు. దీంతో ఈ పథకం గురించి మరింత చర్చించుకుంటున్నారు. ఇందులో మహిళా సాధికారతకు మోడీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి మాట్లాడారు. కేంద్ర మంత్రి గురువారం రోజు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో లఖ్ పతి దీదీ పథకం లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు పెంచనున్నట్లు ప్రకటించారు. అసలు ఈ పథకం ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? తెలుసుకుందాం.


లక్ పతి దీదీ పథకం అంటే ఏమిటి?


1. లక్ పతి దీదీ పథకం కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది మహిళా సాధికారతే ఈ పథకం ప్రధాన లక్ష్యం.


2. మహిళా స్వయం సహాకార సంఘంలో ఉండే మహిళలకు స్కిల్ ట్రైనింగ్ పొందుతారు.


3. లక్ష కంటే తక్కువ ఆదాయం కలిగిన మహిళలు ఆ పథకం ద్వారా లబ్ది పొందుతారు.


4. ఈ స్కిల్ ట్రైనింగ్‌ లో భాగంగా మహిళలకు ఎల్ ఈ డీ బల్బలు, ప్లంబింగ్, డ్రోన్ రిపెయిరింగ్ మొదలైన టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు.


5. ఈ పథకం లబ్ది పొందాలంటే మహిళా స్వయం సహాకార సంఘంలో చేరాలి. దీనికోసం మరింత సమాచారం కావాలంటే స్థానికంగా ఉండే అంగన్వాడి సెంటర్లను సంప్రదించాలి.


ఈ పథకంలో చేరాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్..


ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, ఇన్ కం సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ కలిగి ఉండాలి. ఈ పథకం ప్రధాన లక్ష్యం పేద మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి వారిని లక్షాధికారులను చేయడం, స్వయం సాధికారికతను సాధించడం.


ఇదీ చదవండి: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!


ఇదీ చదవండి: Ayodhya Ram Mandir Darshan: బాలరాముని దర్శనానికి భారీ రద్దీ.. ఆలయ సమయంలో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే...


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook