Reason Behind Odisha Train Accident: ఇండియన్ రైల్వే చరిత్రలోనే అతి ఘోర రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఒడిషా రైలు ప్రమాదానికి ఇంతకీ కారణం ఏంటి ? 365 రోజులు, 24 గంటల పాటు దేశవ్యాప్తంగా కొన్ని వేల రైళ్లు ఒకదానినొకటి క్రాస్ అవుతుంటాయి కదా.. మరి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇంత ఘోర ప్రమాదం ఎందుకు జరిగింది ? ఒడిషా రైలు ప్రమాదం మానవ తప్పిదమా ? లేక సాంకేతిక లోపమే కారణమైందా ? ఇప్పుడు దేశంలో చాలా మంది మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఇండియన్ రైల్వే నిమగ్నమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలాసోర్ జిల్లా బహనగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 288 కి చేరింది. 900 మందికిపైనే గాయపడ్డారు. ఘటనా స్థలం వద్ద సహాయ కార్యక్రమాలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఒడిషా పోలీసు, ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు.. రైలు బోగీల్లో చిక్కుకుపోయిన క్షతగాత్రులను, మృతదేహాలను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించాయి. అంతిమంగా రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో పూర్తిగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ని పునరుద్ధరించేందుకు ఇండియన్ రైల్వే మరమ్మతుల పనులు చేపట్టింది. రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పాటు పట్టాలపై బోగీలు చెల్లా చెదురుగా పడి ఉండటం, సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినడం వంటి ఇబ్బందుల నేపథ్యంలో అటువైపుగా వచ్చే రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు.


ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్‌కి కారణమైన ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశిస్తూ ఇండియన్ రైల్వే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సౌత్ ఈస్టర్న్ సర్కిల్ పరిధిలోని రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ విచారణ కమిటికి నేతృత్వం వహిస్తున్నారు. ఒకవైపు రైల్వే ట్రాక్ పురరుద్ధరణ పనులు జరుగుతుండగానే మరోవైపు విచారణ కమిటీ తన పని తాను చేసుకుపోతోంది. 


కోరమండల్ ఎక్స్‌‌ప్రెస్ రైలు ప్రమాదానికి గల కారణం ఏంటనేది కచ్చితంగా తెలియరానప్పటికీ..  ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం , సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనే టాక్ వినబడుతోంది. అంతేకాకుండా ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ కూడా అందుబాటులో లేదు. కవచ్ వ్యవస్థ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి మరో కారణమైందని రైల్వే అధికారులు చెబుతున్నారు.


ఇంతకీ కవచ్ వ్యవస్థ అంటే ఏంటి, ఎలా పని చేస్తుందంటే .. ?
కవచ్ వ్యవస్థ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఏదైనా కారణాలతో రైలు పట్టాలు తప్పినప్పుడు లేదా ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు.. రెండు రైళ్ల లోకోపైలట్స్ ని అలర్ట్ చేసే సాంకేతిక వ్యవస్థనే ఈ కవచ్ వ్యవస్థ. దీనినే కవచ్ - యాంటీ - కొలిషన్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. ఎప్పుడైతే లోకోపైలట్ ని అప్రమత్తం చేస్తూ అలారం మోగుతుందో... అప్పుడు లోకోపైలట్ రైలు బ్రేక్స్ అప్లై చేసి ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది.


ఇది కూడా చదవండి : Odisha Train Tragedy: ఎంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదు


తాజాగా ప్రమాదం జరిగిన కోల్‌కతా, చెన్నై మార్గంలో ఈ కవచ్ - యాంటీ - కొలిషన్ టెక్నాలజీ వ్యవస్థ అందుబాటులో లేదు. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా అన్నిమార్గాల్లో ఈ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేసేందుకు ఇండియన్ రైల్వేస్ కృషిచేస్తోంది. ఆలోగానే ఒడిషాలో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం.


ఇది కూడా చదవండి : Coromandel Express train Tragedy: 14 ఏళ్ల క్రితం కూడా ఇదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి యాక్సిడెంట్


ఇది కూడా చదవండి : LIVE UPDATES- Odisha Train Accident: 288 మందికి చేరిన మృతుల సంఖ్య.. మరింత పెరిగే అవకాశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK