Odisha Train Tragedy: ఒడిషా రైలు ప్రమాదంలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి అవసరమైన మెరుగైన చికిత్స అందించేందుకు తమ ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తుంది అని అన్నారు. ఒడిషా ట్రైన్ యాక్సిడెంట్‌కి కారకులైన వారిని తమ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. బాలాసోర్ జిల్లా బహనగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 288కి పెరిగింది. పరిస్థితి తీవ్రత చూస్తోంటే.. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది అని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఒడిషాలో రైలు ప్రమాదానికి గురైన స్థలాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. ఈ కేసులో రైలు ప్రమాదానికి బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. రైలు ప్రమాదంలో పూర్తిగా దెబ్బ తిన్న రైల్వే ట్రాక్ ని త్వరితగతిన పునరుద్ధరించి ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లకు ఆటంకం లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. " ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన. క్షతగాత్రుల చికిత్స కోసం కేంద్రం అన్నివిధాల సహకరిస్తుంది అని చెబుతూ... అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి.. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం " అని పేర్కొన్నారు.
#WATCH | "It's a painful incident. Govt will leave no stone unturned for the treatment of those injured. It's a serious incident, instructions issued for probe from every angle. Those found guilty will be punished stringently. Railway is working towards track restoration. I met… pic.twitter.com/ZhyjxXrYkw
— ANI (@ANI) June 3, 2023
ఇది కూడా చదవండి : Coromandel Express train Tragedy: 14 ఏళ్ల క్రితం కూడా ఇదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి యాక్సిడెంట్
ఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షించిన అనంతరం బాలాసోర్ లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇప్పటివరకు అందించిన సహాయక చర్యలు, ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యల గురించి వివరించారు. రైల్వే అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రైల్వే అధికారులు, ఇతర సిబ్బందితో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా వారిని ఆదేశించారు.
ఇది కూడా చదవండి : Odisha Train Accident Updates: కవాచ్ వ్యవస్థ అంటే ఏమిటి..? ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగింది..?
ఇది కూడా చదవండి : Odisha Train Accident Latest Updates: రైలు ప్రమాదంలో మరణించిన వారికి 35 పైసల బీమా వర్తిస్తుందా..? ఎంత డబ్బు వస్తుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK