Vaccine Side Effects: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశమంతా కొనసాగుతోంది. మరోవైపు 18 ఏళ్లు నిండినవారికి సైతం మే 1 నుంచి వ్యాక్సిన్ పడనుంది. ఈ నేపధ్యంలో అసలు వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్ ఎలా, సైడ్‌ఎఫెక్ట్స్ వస్తే ఎవరిని సంప్రదించాలనే సందేహాలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యాక్సినేషన్‌(Vaccination)పై ప్రజల్లో చాలా సందేహాలున్నాయి. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేయాలి, ఎలాంటి గుర్తింపు కార్డులు కావాలి, వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్ వస్తే వెంటనే ఏం చేయాలనే ప్రశ్నలున్నాయి. ముందుగా www.cowin.gov.in లింకు క్లిక్ చేసి..రిజిస్టర్ , సైన్ ఇన్ యువర్ సెల్ఫ్‌ను క్లిక్ చేయాలి. అనంతరం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌తో కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకమైన యాప్ లేదు. కేవలం కోవిన్ పోర్టల్ ( Cowin portal) ద్వారానే రిజిస్టర్ చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 45 ఏళ్లు  దాటినవారు రిజిస్టర్ చేసుకుంటున్నారు. మే 1 నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ కోసం 18 ఏళ్లు నిండివారు ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ద్వారా అయితే ఇతర ఇబ్బందుల్లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.


మీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ నిర్ధారణ జరిగిన వెంటనే వ్యాక్సినేషన్ కేంద్రం, వ్యాక్సిన్ (Vaccine) తీసుకోవల్సిన రోజు, సమయం వంటి వివరాలు మీ మొబైల్ నెంబర్‌కు మెస్సేజ్ రూపంలో వచ్చేస్తాయి. వ్యాక్సినేషన్‌లో రెండు డోసులుంటాయి. కోవ్యాగ్జిన్ (Covaxin) అయితే మొదటి డోసుకు రెండవ డోసుకు 4-6 వారాల వ్యవధి ఉండాలి. ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ ( Covishield vaccine)కు అయితే 6-8 వారాల వ్యవధి ఉండాలి. రిజిస్ట్రేషన్ సమయంలో సమస్యలు వస్తే 1075 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు.మొదటి డోసు  ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో..రెండవది కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవల్సి ఉంటుంది. 


ఇక వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ఏమైనా సైడ్‌ఎఫెక్ట్స్(Vaccine Side Effects) వస్తే..తక్షణం వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సంప్రదించాలి. లేదా 1075 టోల్ ఫ్రీ నెంబర్, 9111-23978046 హెల్ప్ లైన్ నెంబర్ లేదా 0120-4473222 టెక్నికల్ హైల్ప్ లైన్ నెంబర్ లేదా nvoc2019@gov.in మెయిల్‌కు సంప్రదించవచ్చు. జ్వరం, జలుబు వంటి లక్షణాల్లేనప్పుడు వ్యాక్సిన్ తీసుకోవల్సి ఉంటుంది. 


Also read: Corona Indian Strain: ఇండియాలో విస్తరిస్తున్న కరోనా వేరియంట్ ఎలాంటిది..ఏ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook