భారతదేశంలో ఎయిడ్స్ నివారణకు ఎంతో పెద్దపీట వేస్తున్న కండోమ్ ప్రచార యాడ్స్‌ను పగలు కూడా ప్రసారం చేయాలన్న వాదనకు తిలోదకాలిస్తూ.. కేవలం రాత్రి 10 గంటల తర్వాతే ప్రసారం చేయాలన్న కేంద్ర సమాచార శాఖ నిబంధనలతో ఏకీభవిస్తూ.. గ్లోబల్ ఎలైన్స్ ఫర్ హ్యుమన్ రైట్స్ ఎన్జీఓ ఫైల్ చేసిన పిటీషన్‌ను రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాలలోకి వెళితే, కండోమ్ వాడాలంటూ చెప్పే యాడ్స్‌ను రాత్రివేళల్లో మాత్రమే ప్రసారం చేయాలన్న నిబంధన వల్ల ఎయిడ్స్ పై పోరాటం చేస్తున్న తమ ఎన్జీఓ లక్ష్యం నీరుగారుతుందని గ్లోబల్ ఎలైన్స్ ఫర్ హ్యుమన్ రైట్స్  కౌన్సిల్ ప్రతీక్ కలిస్వాల్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. "భారతదేశంలో ఒకప్పుడు 43 కోట్ల జనాభా ఉంటే.. స్వాతంత్ర్యం వచ్చాక అదే జనాభా 1.3 బిలియన్లు పెరిగింది. అప్పుడు మీ సంస్థలు అన్నీ ఎక్కడున్నాయి. అప్పుడు ఎందుకు కండోమ్ వాడమని ప్రచారం చేయలేదు?" అని కోర్టు ప్రశ్నించింది.


జస్టిస్ గోపాలక్రిష్ణ వ్యాస్ మరియు జీఆర్ మూలచందాని ధర్మాసనం, ఎన్జీఓ పిటీషన్ గురించి ప్రశ్నిస్తూ " మీరు కండోమ్ వల్ల గర్భాన్ని నిరోధించవచ్చన్న అంశాన్ని ప్రచారం చేయకుండా సుఖవ్యాధుల బారిన పడకుండా ఉండడానికి వాడమని చెబుతున్నరారు. అలాంటప్పుడు ఇదే యాడ్స్ రాత్రి 10 గంటల తర్వాత ప్రసారం చేస్తే తప్పేముంది. మీరు ఈ పిటీషను ద్వారా ఏం అడగాలని భావిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి అసమగ్రమైన సమాచారంతో కూడిన పిటీషన్లను మేం ప్రోత్సహించం" అని ఆయన తెలిపారు.


"ఈ కండోమ్ యాడ్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయంటే అందులో అసభ్యతపాళ్లు ఎక్కువగా ఉంటోంది. కుటుంబంతో కలిసి కూర్చొని ఎవరూ ఈ యాడ్స్ చూడలేరు. కండోమ్ కంపెనీలు ఈ యాడ్స్‌ను వేరే ఉద్దేశంతో ప్రమోట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు వాటిని పగలు ప్రసారానికి అనుమతించలేం" అని కోర్టు తెలిపింది