రైల్వే ట్రాక్‌పై ఒక బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. విరిగిపోయిన ట్రాక్ ను చూశాడు. చివరకు రైలును ఆపి వందలాది ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన బీహార్ లో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. భీం అనే 12 ఏళ్ల బాలుడు విరిగిన పట్టాలను చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి దగ్గరలో ఉన్న గేట్ మెన్ కు చెప్పాడు. గేట్ మెన్ వెంటనే స్పందించి.. స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి బాలుడు చెప్పిన విషయాన్ని చెప్పగా, రైలును ఆపేశారు. అప్పుడు ఆ సమయంలో ఆ మార్గంలో గోరఖ్ పూర్-నర్కటియగంజ్ లోకల్ ట్రైన్ నడుస్తోంది. సమయానికి బాలుడు స్పందించి ఈ విషయం చెప్పకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.