Covid19 Booster Dose: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇండియా వందకోట్ల వ్యాక్సినేషన్ మార్క్ దాటింది. ఎప్పట్నించో విన్పిస్తున్న కరోనా బూస్టర్ డోసుపై ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. బూస్టర్ డోసు ఎప్పుడనేది ఆ సంస్థ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండియాలో రెండు డోసులు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇటీవలే వందకోట్ల వ్యాక్సినేషన్ మార్క్‌ను(India at 100 Crore Vaccination)చేరుకుంది ఇండియా. అయితే కరోనా బూస్టర్ డోసు అంటే మూడవ డోసు ఎప్పుడివ్వాలనే విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. కరోనా బూస్టర్ డోసు అవసరమని చెబుతున్నా..ఎప్పుడివ్వాలనేది కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఇంకా ప్రకటించలేదు. ఈ తరుణంలో ఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసుల వ్యాక్సిన్‌కు అదనంగా మరో డోసు అంటే బూస్టర్ డోసు(Covid Vaccine Booster Dose)ఇవ్వాల్సిన అవసరముందని తెలిపారు. ఈ బూస్టర్ డోసును ఏడాది తరువాత ఇచ్చే పరిస్థితి రావచ్చని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసులు ప్రజల్ని మరణాల్నించి, ఆసుపత్రి పాలయ్యే అవకాశాల్నించి ఎంతకాలం కాపాడుతున్నాయనేదాన్ని బట్టి బూస్టర్ డోసు ఎప్పుడివ్వాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు. 


వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తి శరీరంలో యాంటీబాడీల(Corona Antibodies)ఉనికికి కొలమానంగా తీసుకోమని డాక్టర్ రణదీప్ గులేరియా(Dr Randeep Guleria) తెలిపారు. చిన్న పిల్లలకు త్వరలోనే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్, యూకే, యూరోపియన్‌ యూనియన్, యూఏఈ తదితర దేశాలు ఇప్పటికే బూస్టర్‌ డోసులను సిఫారసు చేసిన అంశాన్ని ప్రస్తావనకొచ్చింది. బూస్టర్‌ డోసు ఎప్పుడివ్వాలనే దానిపై నిర్దిష్ట సమాధానం లేదని.. కరోనాపై పోరాడే యాంటీబాడీలు తగ్గుతున్నాయనే కారణంతో బూస్టర్ డోసు ఇవ్వలేమన్నారు. కరోనా బూస్టర్ డోసు అనేది సమయాన్ని బట్టి నిర్ణయించాలని సూచించారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రెండో డోసు తీసుకొని ఎంతకాలమైందనేది పరిగణలో తీసుకుని ఏడాది సమయం తరువాత బూస్టర్‌ డోసుపై(Covid Booster Dose)నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. 


యూకేలో గత ఏడాది డిసెంబర్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని.. ఇప్పుడక్కడ కొత్త కేసులు పెరుగుతున్నాయి కానీ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరగడం లేదని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. అంటే 2020 డిసెంబర్‌లో తీసుకున్న వ్యాక్సిన్ ఇంకా పనిచేస్తున్నట్లేనన్నారు. వ్యాక్సిన్ రక్షణ దీర్ఘకాలికంగా ఉంటుందని..వైరస్ రూపాంతరం చెంది బలపడితే బూస్టర్ డోసు ఇవ్వాల్సి రావచ్చని స్పష్టం చేశారు. 


Also read: Amit Shah : క‌శ్మీర్‌కు రాష్ట్ర హోదా పున‌రుద్ధ‌ర‌ణ - అమిత్‌షా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook