'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. భారత దేశంలోనూ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 వేల 360 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో 339  మంది మృతి చెందారు. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఈ రోజుతో 21 రోజుల లాక్ డౌన్ ముగిసింది. కానీ కరోనా మహమ్మారి లొంగి రాకపోవడంతో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రధాని నరేంద్ర నిర్ణయించారు. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. మరోవైపు దేశంలో కొన్ని కేంద్రపాలిత  ప్రాంతాలు, కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదు. నమ్మశక్యం  కాకపోయినప్పటికీ ఇది నిజం. 


దేశంలో అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ లక్ష్యద్వీప్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యులో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఈ ప్రాంతాలకు మిగతా రాష్ట్రాల నుంచి ఎవరూ వెళ్లకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు సిక్కిం రాష్ట్రంలోనూ ఒక్క  కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం విశేషం. అటు ఈశాన్య రాష్ట్రాలైన  మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..