Draupadi Murmu from BJP: ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపి
Who is Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేసినట్టు బీజేపి ప్రకటించింది. ఇదే ఎన్నికకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించిన కొద్ది గంటల అనంతరమే బీజేపి నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
Who is Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ తరపున పోటీ చేయబోయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేసినట్టు బీజేపి ప్రకటించింది. ఇదే ఎన్నికకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించిన కొద్ది గంటల అనంతరమే బీజేపి నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఢిల్లీలోని బీజేపి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో బీజేపి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్యలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఒడిషాలోని గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా సేవలు అందించారు. ప్రతిపక్షాలు నిలబెట్టిన యశ్వంత్ సిన్హాతో అధికార పార్టీతో పాటు వారి మిత్రపక్షాల అభ్యర్థిగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడనున్నారు.
తొలి గిరిజన మహిళగా రికార్డుకెక్కనున్న ద్రౌపది ముర్ము..
జూలై నెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించి రాష్ట్రపతిగా ఎన్నికైనట్టయితే.. భారత దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ఆమె అరుదైన ఖ్యాతి సొంతం చేసుకోనున్నారు.
Also read : President Election: కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. కొత్త పార్టీ లేనట్టేనా? తెలంగాణలో ఏం జరగబోతోంది?
Also read : Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్.. టీఎంసీకి యశ్వంత్ సిన్హా రాజీనామా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.