Bhanupriya Meena: దేశవ్యాప్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పాకిన ఈ కుంభకోణం కేసులో తెలుగు ప్రముఖులు చిక్కుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ త్వరలోనే పూర్తి కానుందని.. ప్రధాన సూత్రధారిని త్వరలోనే పట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ మాత్రం దేశాన్ని విస్తుగొలిపింది. కవిత అరెస్ట్‌ను యావత్‌ లోకం తప్పుబడుతోంది. అయితే కవిత అరెస్ట్‌ సమయంలో విచారణ అధికారిగా వచ్చిన ఓ అధికారిణి మీద అందరి దృష్టి పడింది. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌తో తీవ్ర వాగ్వాదం చేసిన ఆమె ఎవరు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలో ఆ అధికారి ఎవరు అని నెటిజన్లు వెతుకుతున్నారు. కేటీఆర్‌ను ధైర్యంగా ఎదుర్కొన్న ఆ అధికారిణి పేరు భానుప్రియ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?


 


భానుప్రియ చరిత్ర ఇదే..
ఆమె స్వస్థలం రాజస్థాన్‌లోని కరౌలీ. తండ్రి, అక్క కూడా సివిల్‌ సర్వీస్‌లో ఉన్నారు. తండ్రి ఉద్యోగం రీత్యా చాలా చోట్లకు వెళ్లాల్సి రావడంతో ఆమె చదువు పలుచోట్ల కొనసాగింది. ఉన్నత విద్య మాత్రం ఢిల్లీలో పూర్తయ్యింది. అయితే చిన్నప్పటి నుంచి తండ్రిని ఆదర్శంగా తీసుకుని భానుప్రియ పెరిగింది. అనంతరం ఆమె అక్క కూడా సివిల్స్‌ సర్వీసెస్‌లో చేరడంతో ఇక తన లక్ష్యం కూడా సివిల్స్‌ సాధించడమే పెట్టుకుంది. నాన్న, అక్క ప్రోత్సాహం, సహకారంతో భానుప్రియ పరీక్షలకు సిద్ధమై ఎట్టకేలకు సివిల్స్‌ ఉద్యోగం సాధించింది. 2005లో సివిల్స్‌ జాబ్‌ కొట్టారు. మొదట పరిశ్రమల శాఖలో విధులు నిర్వహించారు. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌  విభాగంలో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. 

Also Read: KTR: ప్రియమైన చెల్లెలు కవిత అరెస్ట్‌పై కేటీఆర్‌ సంచలన ట్వీట్‌.. ఏమన్నారంటే?


 


మద్యం కుంభకోణంలో కీలక పాత్ర
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భానుప్రియ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో భానుప్రియ ద్వారా చాలా మంది అరెస్ట్‌ అయ్యారు. అయితే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో వాగ్వాదం నేపథ్యంలో భానుప్రియ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. రాజకీయాల్లో కీలక నాయకుడైన కేటీఆర్‌ను ఎలాంటి భయం లేకుండా భానుప్రియ ధైర్యంగా నిలబడ్డారు. ఎలాంటి ఒత్తిడి ఉన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. ఈడీ బృందంలో అత్యంత కీలక అధికారిణిగా భానుప్రియ పేరు తెచ్చుకున్నారు. కీలకమైన కేసుల్లో భానుప్రియ సేవలను ఈడీ వినియోగించుకుంటోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్ట్‌ వ్యవహారంలో కూడా భానుప్రియ ఉన్నారు. ప్రస్తుతం కవిత ఈనెల 22వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ విచారణలో ఆమెతో రాబట్టిన విషయాలతో ఆమె భవిష్యత్‌ ఏమిటో తేలనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter