నిత్యానంద శిష్యులు ఆయనపై ఎందుకు రెచ్చిపోతున్నారు..!
ప్రముఖ తమిళ కవి వైరముత్తు ఇటీవలే తమిళ దేవత ఆండాళ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
ప్రముఖ తమిళ కవి వైరముత్తు ఇటీవలే తమిళ దేవత ఆండాళ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆండాళ్ దేవతను 'దేవదాసి' అని సంబోధించడంపై పలు హిందూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా, వైరముత్తు అందుకు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. తను మాట్లాడిన మాటలను పరిశీలిస్తే.. అందులో అభ్యంతకరమైన విషయాలు ఏమీ లేవని... తన దృష్టిలో దేవదాసిలు అంటే.. దేవుడికి సేవ చేసే స్త్రీలని ఆయన తెలిపారు. ఆండాళ్‌ను తను ఎక్కడా కించపరచలేదని తెలిపారు.
ఈ క్రమంలో ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ, కర్ణాటకలోని రామనగర ప్రాంతానికి చెందిన నిత్యానంద ఆశ్రమ విద్యార్థినులు వైరముత్తుపై విరుచుకుపడ్డారు. ఆయనను దూషిస్తూ.. బూతులు తిడుతూ ఫేస్బుక్‌లో అనేక వీడియోలు పోస్టు చేశారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి కూడా వారు మాట్లాడుతూ వీడియోలు పోస్టు చేయడంతో.. వైరముత్తు సెక్షన్ 23 జువైనల్ జస్టిస్ యాక్ట్ క్రింద ఆ విద్యార్థినుల పై కేసు నమోదు చేశారు. పిల్లలను చెడుమార్గం వైపు తీసుకెళ్తున్న నిత్యానంద విద్యాలయంపై కూడా చర్యలు తీసుకోవాలని వైరముత్తు కోరారు.