దేశవ్యాప్తంగా త్వరలో 6000 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని మంగళవారం రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 6000 రైల్వే స్టేషన్‌లలో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదుపాయం ప్రయాణీకులకు తేలికగా ప్రయాణించటానికి సహాయపడటమే కాకుండా వ్యవసాయం, బోధన వంటి వారి వృత్తికి సంబంధించిన అదనపు సమాచారాన్ని పొందేందుకు కూడా సహాయపడుతుందన్నారు. "స్టేషన్లలో వైఫై సదుపాయాల కారణంగా ప్రజలు, ముఖ్యంగా గ్రామాలలో నివసిస్తున్న పిల్లలను, రైతులకు, పని చేసే స్త్రీలకు లబ్ధి చేకూరుతుందని నేను నమ్ముతున్నాను" అని అన్నారు.


ప్యాసింజర్ విమానాల్లో పోలినట్లు.. రైలు కోచ్‌లలో కూడా బయో వాక్యూమ్ టాయిలెట్‌లను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా కేంద్ర మంత్రి గోయల్ వెల్లడించారు.


రైల్వే హెల్ప్ లైన్ సర్వీసును ప్రారంభించాలనుకుంటున్నారా? అని గోయల్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. ఆ ఆలోచన ఉందని.. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ప్రస్తుతానికి నిలిచిపోయిందన్నారు.


జూలైలో, ట్రాక్‌ల మరమ్మత్తుల కోసం భారతీయ రైల్వే ప్రధాన దృష్టి సారించింది. ట్రాక్‌లను పూర్తిగా పర్యవేక్షించుటకు, రిలే చేయుటకు, ప్రయాణీకుల భద్రత, ట్రాక్స్ నిర్వహణ కొరకు రైల్వే మంత్రిత్వ శాఖ ఐదు కొత్త ట్రాక్ నిర్వహణ యంత్రాలను కొనుగోలుచేసింది.