కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి కట్టడి కోసం ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆతృతగా ఉంది. వ్యాక్సిన్ సిద్ధమైతే..పంపిణీ కోసం దేశం సిద్దంగా ఉందా..80 వేల కోట్లున్నాయా అంటూ సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) సీీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ఇప్పుడు మానవాళి మనుగడకు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దిగ్గజ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో రష్యా ( Russia ) ఇప్పటికే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ( Sputnik v vaccine ) ను మార్కెట్లో విడుదల చేయగా...ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వంటి కంపెనీల వ్యాక్సిన్ లు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయి.  అన్నీ సక్రమంగా జరిగితే..ఏడాది చివర్లో వ్యాక్సిన్ విడుదలపై అవగాహన వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారతదేశం వ్యాక్సిన్‌ కొనుగోలు, పంపిణీ మార్గదర్శకాలు తదితర విషయాల్లో ఎంత వరకు సన్నద్ధంగా ఉందన్న అంశంపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum institute ) సీఈఓ ( CEO ) అదార్ పూణావాలా ( Adar poonawalla ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



వ్యాక్సిన్ పంపిణీ కోసం భారతదేశం 80 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. ఎందుకంటే వాక్సిన్‌ కొనుగోలు చేసేందుకు, దేశంలోని ప్రతీ వ్యక్తికి దానిని పంపిణీ చేసేందుకు  ఆరోగ్య శాఖకు ఆ మేరకు నిధులు అవసరమౌతాయని అదార్ పూణావాలా చెప్పారు.  మనమంతా రానున్న కాలంలో ఎదుర్కోబోయే అతి పెద్ద సవాలు ఇదేనని చెప్పారు. దేశీయ, విదేశీ ఫార్మా కంపెనీలను సంప్రదించి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అంశంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించేందుకే తానీ ప్రశ్న అడిగినట్లు పూణావాలా తెలిపారు. 


ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా ( Oxford - AstraZeneca ) అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ ఒప్పందం భారతదేశానికి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ పై ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా అదార్ పూణావాలా సమాచారాన్ని అందిస్తున్నారు. Also read: The Lancet: దేశంలో కరోనా పరిస్థితులపై హెచ్చరిక