భారత్‌లో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ కరోనావైరస్ (COVID-19 Vaccine) వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ) స్పందించారు.
Oxford-AstraZeneca vaccine: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్..సక్సెస్ ఫార్ములాను ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కనుగొంది. డబుల్ డోస్ విధానంలో నూటికి నూరుశాతం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
భారత ఫార్మా దిగ్గజాలు భారత్ బయోటెక్ (Bharat Biotech), సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి రెండు రోజుల క్రితం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌లో తయారవుతున్న పలు వ్యాక్సిన్‌ల పురోగతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమీక్షించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లో పర్యటించి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శించారు.
కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం జరుపుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటీ సఫలమవుతున్నాయి. మొన్న ఫైజర్..నిన్న మోడెర్నా..ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందనే ప్రకటన ఆశలు రేపుతోంది.
ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ (Covid-19 vaccine ) భారత్‌తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.
కోవిడ్-19 (Coronavirus) 19) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca) తో కలిసి భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుందన్న విషయంపై సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా (Adar Poonawalla) గురువారం కీలక ప్రకటన చేశారు.
కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో వచ్చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 3 దిగ్గజ కంపెనీలు చివరి దశ ఫలితాలు విజయవంతమైనట్టు చెబుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ..ఉత్పత్తి, పంపిణీ మాటేంటి..ఇదే అతిపెద్ద సవాలంటున్నారు ఫార్మా నిపుణులు.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఇంకెంతో దూరంలో లేదు. 3 విదేశీ కంపెనీ వ్యాక్సిన్‌లు డిసెంబర్ నాటికి అందుబాటులో రానుండగా..దేశీయంగా తయారైన రెండు వ్యాక్సిన్‌లు సైతం అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాయి.
కోవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే భారతదేశంలో అందుబాటులో రానుంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఈ మేరకు ఓ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నాటికి 10 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
కరోనా వైరస్ బారిన పడి మరణించిన బ్రెజిల్ డాక్టర్ వ్యవహారంపై ఇప్పుడు రాద్ధాంతం చెలరేగుతోంది. వ్యాక్సిన్ ట్రయల్స వల్ల మరణించారంటూ తొలుత వచ్చిన వార్తలు తప్పని...మరో వాదన ప్రారంభమైందిప్పుడు.
కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ (AstraZeneca Vaccine) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ టీకా చివరిదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ (clinical trials) ను తాత్కాలికంగా నిలిపివేసి.. మళ్లీ పున:ప్రారంభించారు.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి.
ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ( AstraZeneca-Oxford ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ 19 కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( covishield vaccine ) క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో మళ్లీ పున:ప్రారంభం కానున్నాయి. ఇటీవల కాలంలో ఈ కరోనా (Coronavirus) వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో.. చివరి దశ ప్రయోగాలకు భారత్‌తో సహా అన్నీ దేశాల్లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాక్సిన్ లు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను మార్కెట్లో విడుదల చేయడానికి చైనా కంపెనీ ప్రయత్నిస్తోంది.
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ట్రయల్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి. వ్యాక్సిన్ తో ప్రమాదం లేదంటూ క్లీన్ చిట్ రావడంతో పరీక్షలు మొదలయ్యాయి. భారత్ లో కూడా పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
కోవిడ్19 వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా మరికొన్ని రోజుల్లో అందిస్తాయనుకున్న తరుణంలోనే.. చివరిదశ ప్రయోగాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలలో ఆక్స్‌ఫర్డ్ టీకా చివరిదశ ప్రయోగాలు జరుగుతున్న క్రమంలోనే.. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురయ్యాడు.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ (Coronavirus) వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్ట్ పేర్కొంది.