Woman Fights With Leopard: తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ మహిళ ప్రాణాలను పణంగా పెట్టింది. తన 6 ఏళ్ల కుమార్తెను రక్షించడానికి చిరుతపులితో పోరాడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా (Bahraich district) ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గిర్దా గ్రామంలో ఓ బాలిక తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా..ఆకస్మాత్తుగా చిరుతపులి ఆ చిన్నారిపైకి దూకింది (leopard attack). కూతురి అరుపు విన్న మహిళ బయటకు వచ్చి..చిరుతపులిపై పెద్ద కర్రతో దాడి చేసింది. దీంతో చిరుత అక్కడ నుంచి పారిపోయింది. చిరుతపులి దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. 


సమాచారం అందుకున్న అటవీ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని... బాలికను శివపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బహ్రైచ్ అటవీ డివిజన్‌లోని నాన్‌పారా రేంజ్ (Naanpara forest division) నుండి చిరుతపులి వచ్చినట్లు తెలుస్తోంది. 


Also Read: Viral Video: ఖడ్గమృగాన్ని ఒళ్లో పడుకోబెట్టుకుని ముద్దాడుతోన్న అమ్మాయి.. షాక్ అవుతోన్న నెటిజెన్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి