Viral Video: ఖడ్గమృగాన్ని ఒళ్లో పడుకోబెట్టుకుని ముద్దాడుతోన్న అమ్మాయి.. షాక్ అవుతోన్న నెటిజెన్స్!

Girl Kisses Rhino, Viral Video: సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఫన్నీ వీడియోలు చూసినప్పుడు మనం తెగ ఎంజాయ్ చేస్తాయి. కానీ కొన్ని గగుర్పొడిచే వీడియోలు మాత్రం షాకింగ్‌కు గురి చేస్తాయి. అలాంటి వీడియోనే ఇది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 06:39 PM IST
  • సోషల్ మీడియాలో వైర​ల్ అవుతోన్న వీడియో
  • మూడు ఖడ్గమృగాలతో సరదాగా గడిపిన అమ్మాయి
  • ఖడ్గమృగాన్ని ఒళ్లో పడుకోబెట్టుకుని ముద్దాడిన వీడియో వైరల్
  • షాక్ అవుతోన్న నెటిజెన్స్
Viral Video: ఖడ్గమృగాన్ని ఒళ్లో పడుకోబెట్టుకుని ముద్దాడుతోన్న అమ్మాయి.. షాక్ అవుతోన్న నెటిజెన్స్!

Rhinos Viral Video: సోషల్ మీడియాలో తరుచూ మనం చాలా షాకింగ్ వీడియోలను చూస్తూ ఉంటాం. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైర​ల్ అవుతోన్న ఒక వీడియోలో ఒక అమ్మాయి మూడు ఖడ్గమృగాలతో సరదాగా గడపడం చూడొచ్చు. ఒక ఖడ్గమృగాన్ని (Rhino) తన ఒళ్లో పడుకోబెట్టుకుని దాన్ని ముద్దాడింది ఆమె. ఇక ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఈ 21 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతోంది. 

అయితే ఆ అమ్మాయి మూడు పెద్ద ఖడ్గమృగాల మధ్యలో అలా కూర్చొవడం.. వాటిని ముద్దాడడం మాత్రం పెద్ద సాహసమే అని చెప్పవచ్చు. 

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో రైనోహూస్ అనే అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. జనవరి 15న షేర్ అయిన ఈ వీడియోను కొందరు నెటిజెన్స్‌ (Netizens‌) లైక్ చేస్తుండగా.. మరికొందరు దీనిపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by rhinohuose (@rhinohuose)

 

ఏనుగు తర్వాత అంతటి శక్తింవంతమైన జంతువైన ఖడ్గమృగం ఇలా ఆటలాడడం సరికాదని కొందరు నెటిజెన్స్‌ అంటున్నారు. ఆ ఖడ్గమృగాలు కొమ్ములతో దాడి చేస్తూ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయినా ఆ ఖడ్గమృగం అంత ప్రశాంతంగా ఎలా ఉందబ్బా అంటూ ఒక నెటిజెన్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఈ వీడియోపై పలు రకాలుగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో (Video) సోషల్‌ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతోంది.

Also Read: UP Polls 2022: రాజకీయాలకు పాకిన 'పుష్ప' ఫీవర్... యూపీ ఎన్నికల కోసం 'శ్రీవల్లి' సాంగ్ ను వాడుకున్న కాంగ్రెస్..  

Also Read: Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టైటిల్ సాంగ్​ వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News