కారు నడుపుతూ వాహనంపై పట్టు కోల్పోయిన ఓ 19 ఏళ్ల యువతి.. బ్రేక్‌కి బదులు యాక్సిలరేటర్ తొక్కిన ఘటన ముంబైలో జూన్ 19న చోటుచేసుకుంది. కారు కాస్తా వేగంగా పాదచారులపైకి దూసుకెళ్లడంతో అక్కడే ఉన్న 8 మంది పాదచారులు తీవ్రంగా గాయపడిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ధారావిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కారుని అద్దెకు తీసుకున్న లా విద్యార్థిని అదే వాహనంలో మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి పార్టీకి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు ముంబై పోలీసులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ధారావిలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతంలోకి చేరుకునేటప్పటికీ ఆ యువతి కారు నడపడంలో అయోమయానికి గురైంది. ఆ అయోమయంతోనే కారు బ్రేక్‌కి బదులుగా యాక్సిలరేటర్ తొక్కడంతో కారు మరింత వేగంగా పాదచారులపైకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన మరుసటి రోజే యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిల్‌పై ఆమెను విడిచిపెట్టారు.