Women-Snake Relation: పాము అంటే ఎవరైనా భయ పడతారు. దానిని చూసి పరుగులు పెడతారు. ఐతే ఓ మహిళ మాత్రం సర్పాన్ని సాకుతోంది. కుటుంబసభ్యుడిగా చూసుకుంటోంది. పాముతో కలిసి నాలుగురోజులపాటు జీవనం సాగించింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకు ఏంటా కథ..ఎక్కడ జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్నాటక బాగల్‌ కోట్ జిల్లా వాడిప్పట్టి తాలుకా కులహళ్లిలో మోనేషా కంబారా అనే వృద్ధురాలు జీవనం సాగిస్తోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆ వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. ఈక్రమంలో నాలుగురోజుల క్రితం ఆమె ఇంట్లోకి నాగుపాము వచ్చింది. పామును చూడగానే వృద్ధురాలు భయపడింది. దానిని చూస్తూ భర్తే వచ్చాడని నమ్మింది. సర్పానికి పాలు పోస్తూ సాకుంటోంది. ఆ తర్వాత నాలుగు రోజులపాటు పాముతోనే జీవనం సాగించింది. 


ఇది గమనించిన స్థానికులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. పాము రూపంలో తన భర్త ఉన్నాడని పట్టుకోవద్దని స్థానికులను వేడుకుంది. ఐనా కొందరూ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరయ్యింది. చివరకు స్థానికులతో మాట్లాడుకుని పామును పట్టే పనిని విరమించుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆధునిక యుగంలో ఇలా చేయడం ఏంటని అంటున్నారు.


Also read:Vastu Tips: ఈఎమ్‌ఐ భారంతో ఇబ్బంది పడుతున్నారా..ఐతే ఇలా చేయండి..!


Also read:Indian Presidential Election-2022: మోగిన రాష్ట్రపతి ఎన్నిక నగారా..జులై 18న ఓటింగ్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook