దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల (Delhi Coronavirus cases) సంఖ్య ఇప్పటికే 80 వేలు దాటింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్‌(World's Largest Covid19 Care Center)ను ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దీనికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్‌ (Sardar Patel Covid Center)గా నామకరణం చేశారు.  10 వేల పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ కేంద్రాన్ని హోంమంత్రి అమిత్ షా (Amit Shah), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (G. Kishan Reddy) శనివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఇక్కడ 2 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 8 వేల పడకలను సిద్ధం చేస్తున్నారు.  రాబోయే రెండుమూడు రోజుల్లో ఈ కేంద్రంలో సేవలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలోని రాధ స్వామి సత్సంగ్ వ్యాస్‌లో ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ (covid care centre) ను 25 ఎకరాల్లో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్‌గా అధికారులు పేర్కొంటున్నారు. దీని నిర్వహణను ఐటీబీపీ (ITBP)కి అప్పగించారు. ఇక్కడ సుమారు 875 మంది వైద్యులతోపాటు అదేస్థాయిలో సిబ్బందిని నియమించనున్నారు. సుమారు 10 శాతం మంది రోగులకు ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేశారు. అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


ప్రత్యేక కార్డ్‌బోర్డ్ పడకల ఏర్పాటు.. కిషన్ రెడ్డి
దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక కార్డ్‌బోర్డ్ పడకలను ఇక్కడ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వాటిని రీసైకిల్ చేయవచ్చని, శానిటైజేషన్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  ఢిల్లీలో పెరుగతున్న కేసుల దృష్ట్యా హోంశాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్మించినట్లు పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ