Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా పేర్కొంటున్న విరాట్ రామాయణ మందిర నిర్మాణం ప్రారంభమైంది. మంగళవారం భూమి పూజ అనంతరం ఈ గుడి నిర్మాణ పనులను మెుదలుపెట్టారు. ఈ ఆలయాన్ని బిహార్‌లోని తూర్పు చంపారణ్‌ జిల్లా కల్యాణ్‌పుర్‌ బ్లాకు కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఉదయం 11 గంటలకు పట్నా మహావీర్‌ మందిర్‌ న్యాస్‌ సమితి అధినేత ఆచార్య కిశోర్‌ కునాల్‌ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అంతేకాకుండా ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోయింది. 


అయోధ్య రామ మందిరంలానే ఈ విరాట్ రామాయణ మందిర్ కూడా భక్తులను ఆకట్టుకుంటుందని ఆచార్య కిశోర్‌ కునాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కంబోడియాలోని అంగ్‌కోర్‌ వాట్‌ ఆలయం ఎత్తు 215 అడుగులు కాగా.. తాజాగా నిర్మిస్తున్న విరాట్‌ రామాయణ ఆలయం ఎత్తు 270 అడుగుల ఉంటుంది.  ఈ మందిరాన్ని 125 ఎకరాల విస్తీర్ణంలో ఇన్‌ఫ్రా సన్‌టెక్‌  ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మిస్తోంది. 


Also Read: Jagannath Rath Yatra 2023: ప్రతి సంవత్సరం పూరీ జగన్నాథుని రథయాత్ర ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? తెలుసుకోవడం మన బాధ్యత!


అంతేకాకుండా ఇక్కడ  33 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ లింగాన్ని మహాబలిపురంలో తయారుచేయనున్నారు. 1,008 శివలింగాలను ఒకే లింగంలో పేర్చి దీనికి సరికొత్త రూపును ఇవ్వనున్నారు. ఈ ఆలయ ప్రాంగణం 12 టవర్లతో 22 దేవాలయాల సముదాయంగా ఉంటుంది.  ఈ ఆలయం అయోధ్య నుంచి జనక్ పుర్ మార్గంలో ఉండటం విశేషం. ఇక్కడ హెలిఫ్యాడ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. 


Also Read: Indian Railways: దేశంలోని తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడ, ఎలా ఉంటుందో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook