అరుణాచల్ ప్రదేశ్: ఎట్టకేలకు  భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఏఎన్‌‌-32 విమాన ఆచూకీ లభించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో ఇది కూలిపోయింది. లిపోకి 16 కిలోమీట‌ర్ల దూరంలో విమాన శకలాలను కనుగొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూన్‌ 3న అస్సాంలోని జొర్హాత్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు ప్రాంతమైన మెంచుకాకు చేరాల్సి ఉండగా మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మొత్తం 13 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఏఎన్‌32 విమానం గాలిలోకి ఎగిరి కనిపించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కాగా అప్పటి నుంచి విమానం జాడ కోసం అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.   


ఏఎన్‌‌-32 విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో  ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే  విమాన జాడ తెలిపిన వారికి రూ.5 లక్షల నజరాన ఇస్తామని కూడా ప్రకటించారు. ఎట్టకేలకు ఈ విమానం జాడ ఈ రోజు తెలిసింది.