Sonu sood: సోనూకు హీరో ఆప్ ది ఇయర్‌గా అరుదైన గౌరవం అందించిన యాహూ
Sonu sood: కరోనా లాక్‌డౌన్ సమయంలో హీరోగా మారిన సోనూ సూద్ అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత యాహూ సంస్థ..హీరో ఆఫ్ ది ఇయర్ అంటూ ప్రకటించింది.
Sonu sood: కరోనా లాక్‌డౌన్ సమయంలో హీరోగా మారిన సోనూ సూద్ అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత యాహూ సంస్థ..హీరో ఆఫ్ ది ఇయర్ అంటూ ప్రకటించింది.
కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ప్రపంచమంతా స్థంభించింది. మార్చ్ నుంచి లాక్‌డౌన్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ముఖ్యంగా ఇండియాలో వలస కూలీల పరిస్థితి దిక్కుతోచకుండా మారింది. లాక్‌డౌన్ ( Lockdown ) సమయంలో ఉపాధి లేక సొంత ప్రాంతాలకు కాలినడకన వెళ్తూ అవస్థలు పడిన వలస కూలీల దృశ్యాలు అందరికీ తెలుసు.
ఈ నేపధ్యంలో సోనూ సూద్ ( Sonu sood ) రీల్ హీరో ( Reel Hero ) నుంచి రియల్ హీరోగా ( Real Hero ) మారారు. వలస కూలీలకు నేనున్నానంటూ ముందుకొచ్చారు. వలస కూలీలకు సహాయమందించారు. సొంతంగా బస్సులు, రైళ్లు, విమానయానం కల్పిస్తూ..సహా ఎవరికి అవసరమైనవారిని గమ్యస్థానాలకు చేర్చారు. సహాయం అందించారు. వేలాది కూలీల పాలిట దైవంగా మారారు.
వలస కూలీలు ( Migrant workers ) ఇళ్లకు వెళ్తూ మృతి చెందితే..ఆ కుటుంబాల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. అంతేకాకుండా అడిగినవారికి లేదనకుండా సహాయం అందిస్తూ వచ్చారు.
ఆఖరికి సోషల్ మీడియా ద్వారా సహాయం కోరిన వారిని కూడా రెస్పాండ్ అయ్యారు సోనూ సూద్. అందుకే సోనూసూద్‌ని హీరో ఆఫ్ ది ఇయర్ ( Hero of the year ) అంటూ యాహూ సంస్థ ( Yahoo ) ప్రకటించింది. అరుదైన గౌరవాన్ని అందించింది. అంతేకాకుండా సోనూ సూద్‌ని హీరో ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసింది. Also read: Farmer protest: వ్యవసాయ చట్టం వెనక్కి తీసుకోకుంటే..అవార్డులు వెనక్కి