Quarantine Room: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలు తొలగినా చిక్కులు మాత్రం తప్పడం లేదు. క్వారంటైన్ గది లభిస్తేనే ఫ్లైట్ టికెట్. లేకుంటే అంతే. ఆ వివరాలిలా ఉన్నాయి.
సోను సూద్‌కి ( Sonu Sood ) కోపం కట్టలు తెంచుకుంది. తన పేరు మీద నకిలీ ట్విటర్ ఖాతా ( Fake twitter account ) నిర్వహిస్తున్న ఓ నెటిజెన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. ''ఫేక్ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్నందుకు త్వరలోనే అరెస్టు అవుతావు మై డియర్'' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
Chartered flights for migrant workers | ముంబై: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఇబ్బందుులు పడుతున్న వలస కూలీల ( Migrant workers) పట్ల బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) తన ఔదార్యాన్ని చాటుకున్నారు.లాక్ డౌన్ ( Lockdown) కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన వలస కూలీల్లో 1000 మందికిపైగా వలసకూలీలును వారి వారి స్వస్థలాలకు తరలించడానికి 6 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేసి బిగ్ బి తన గొప్ప మనసు చాటుకున్నారు.
లాక్డౌన్ కారణంగా ఇంటికి చేరుకునే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలు, కార్మికులకు నటుడు సోనూ సూద్ పెద్ద దిక్కుగా మారాడు. అయితే శివసేన పార్టీ మాత్రం సోనూ సూద్ చర్యలను పొలిటికల్ డ్రామాగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
క్వారంటైన్ కేంద్రాల్లో 2 ప్యాకెట్ల కండోమ్స్ పంచుతూ అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోవిడ్19కు దీనికి ఏ సంబంధం లేదని, మంచి ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు వైద్యశాఖ అధికారి తెలిపారు.
Telangana COVID-19 updates తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తోంది. మంగళవారం నాడు కొత్తగా మరో 99 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, మిగితా 12 మంది వలసకూలీలు ( Migrant workers ) ఉన్నారు. స్థానికులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 70 కేసులు వెలుగుచూశాయి.
తెలంగాణలో శనివారం కొత్తగా మరో 74 కరోనా పాజిటివ్ కేసులు ( coronavirus positive cases ) నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే అత్యధికంగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,499కు చేరుకుంది.
తెలంగాణలో శుక్రవారం కొత్తగా 100 కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల మధ్య జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 100 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.
తెలంగాణలో గురువారం నాడు కొత్తగా 66 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive cases ) నమోదయ్యాయి. అందులో ఇద్దకు వలస కూలీలు ఉండగా మరో 49 మంది సౌది అరేబియా ( Saudi Arabia deportees ) నుంచి వచ్చిన వారు ఉన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1908కి చేరింది.
కరోనావైరస్ వ్యాప్తి (Coronavirus ) విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు ( Lockdown rules ) సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి మరీ అంత ఉధృతంగా ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana CM KCR ) అన్నారు. అయితే అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉందని ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus positive cases in Telangana ) మళ్లీ విజృంభిస్తోంది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా మరో 107 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 49 మందికి ( Saudi Arabia deportees ) కరోనా సోకినట్టు గుర్తించగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనూ 19 మందికి ( Migrant workers ) కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.
కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.
కూలీలకు సైతం జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు చెప్పిందని, ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలందరికీ పని కల్పి్ంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కారు సాహసోపోతమైన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికి వలస కూలీలను వెళ్లనివ్వబోమని స్ఫష్టం చేసింది. వారికి రాష్ట్రంలోనే పని కల్పించడంతోపాటు సామాజిక భద్రత, బీమా కూడా ఏర్పాటు చేయనున్నారు.
వలసకూలీలకు ( Migrant workers ) ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( shramik special trains ) ద్వారా వారి స్వస్థలాలకు చేరవేయడంలో నిరంతరంగా సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వే ( Indian Railways ).. తాజాగా మరో ప్రకటన చేసింది.
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఇంకెక్కడికో వలసపోయిన వలసకూలీలు ( Migrant workers ) లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న వలస కూలీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ( Good news for migrant workers ) చెప్పింది.
జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంటలో వలసకూలీల కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది ( Migrant workers family committed suicide ) . స్థానికంగా ఉన్న ఓ కోల్డ్ స్టోరేజ్‌కు ఎదురుగా ఉన్న వ్యవసాయ బావిలో దూకి నలుగురు వలస కూలీలు ఆత్మహత్యకు చేసుకున్నారు.
సోషల్ డిస్టన్సింగ్... కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ఔషదం కంటే అతి ముఖ్యమైనది. ఇక మన జీవితాల్లో ఒక భాగం కావాల్సింది. కానీ కారణాలేవైనా అక్కడక్కడా ఆ సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. అటువంటి దృశ్యమే ఒకటి తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ( Coimbatore in TamilNadu) కనిపించింది.
గుజరాత్‌లోని సూరత్‌లో వలస కార్మికులు పోలీసులపై ఆక్రోశాన్ని ప్రదర్శించారు. తమను సొంత గ్రామాలకు పంపించాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తూ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. వజ్రాలు, టెక్స్టైల్స్ పరిశ్రమల్లో పని చేసే వలస కార్మికులు ఈ ఆందోళనకు దిగారు.
తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు గుర్తించిన ఆరు కేసులలో 5 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా మరొకటి రంగారెడ్డి జిల్లా పరిధిలోనిది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులిటెన్ ప్రకారం.. శుక్రవారం నమోదైన ఆరు కరోనా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.