Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌ను ఖతం చేస్తాం.. ముంబై పోలీసులకు బెదిరింపుల సందేశం.. అలర్ట్ అయిన పోలీసులు..
Uttar pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తామంటూ కూడా బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Death therat to Uttar Pradesh cm yogi Adityanath: ప్రస్తుతం దేశంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఒక వైపు రాజకీయ నేతలు, మరోవైపు బాలీవుడ్ సెలబ్రీటీలను కంటి మీద కునుకులేకుండా చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో తాజాగా, ముంబై పోలీసులకు మళ్లీ బెదిరింపుల మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేకుండా బాబా సిద్దీఖీ కన్న దారుణంగా చంపుతామని కూడా బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది.
దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ను టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. సల్మాన్ మిత్రుడు బాబా సిద్దీఖీని గత నెల అత్యంత క్రూరంగా బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపి హతమార్చారు.
ఆతర్వాత కూడా బీహర్ ఎంపీ పప్పు యాదవ్ కు కూడా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపుల సందేశం రావడంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. సిద్దీఖీ కుమారుడు జీశాన్ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉండగా.. బిష్ణోయ్ గ్యాంగ్ ల బెదిరింపులు ఇటీవల మరీ ఎక్కువైనట్లు తెలుస్తొంది.
ఒకసారి 5 కోట్లివ్వాలని, మరోక వ్యక్తి 2 కోట్లివ్వాలని సల్మాన్ ఖాన్ ను బెదిరింపుల సందేశాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆతర్వాత పోలీసులు జార్ఖండ్ కు వెళ్లి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే.. వరుస బెదిరింపుల నేపథ్యంలో.. సల్మాన్ తన భద్రతను పెంచుకున్నారని, అధునాతన బుల్లెట్ ప్రూఫ్ కారును సైతం కొనుగోలు చేసినట్లు తెలుస్తొంది.
హమ్ ఆప్ కే హయ్ కోన్ సినిమా షూటింగ్ లో భాగంగా సల్మాన్ ఖాన్.. రాజస్తాన్ కు వెళ్లినప్పుడు అక్కడ మచ్చల జింకను వేటాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ను చంపుతామని కూడా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏది ఏమైన బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం.. సల్మాన్ ను చంపుతామని టార్గెట్ గా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.