kanpur encounter: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కాల్పులు జరిపి ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన ప్రధాన నిందితుడు వికాస్ దుబే ( Gangster Vikas Dubey) పై ఉన్న రివార్డును యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం భారీగా పెంచింది. దుబేపై ఉన్న 2.5 లక్షల రివార్డును 5లక్షలకు పెంచుతున్నట్లు యూపీ అధికారులు తెలిపారు. Also read: కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో కీలక పరిణామం


అయితే వికాస్ దుబే లొంగిపోతున్నట్లు వస్తున్న వార్తలతో గ్రేటర్ నోయిడాలో హెచ్చరికను జారీచేశారు. అంతేకాకుండా యూపీ, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అలెర్ట్‌ను ప్రకటించారు. మేరకు కోర్టులకు వచ్చే వ్యక్తుల మాస్కులను తొలగించి పరిశీలిస్తున్నారు. సరిహద్దుల్లో అన్నిచోట్ల పకడ్భందిగా తనిఖీలు చేస్తున్నారు.  అయితే దుబే పారిపోయేటప్పుడు బావిలో ఆయుధాలను పారేసినట్లు వార్తలు రావడంతో యూపీ ఎస్టీఎఫ్ బృందం బిక్రు గ్రామానికి చేరుకోని పరిశీలిస్తున్నారు. Also read: Kulbhushan Jadhav: రివ్యూ పిటిషన్‌కు జాదవ్ నో, క్షమాభిక్షకే సుముఖత : పాక్
 
ఫరీదాబాద్‌లో బసచేసిన దుబే... 
గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఫరిదాబాద్‌లోని ఓయో హోటల్‌తోపాటు న్యూ ఇందిరా కాలనీలోని తన బంధువు ఇంట్లో రెండుమూడు రోజులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇదిలాఉంటే వికాస్ దుబే అత్యంత సిన్నిహితుడు ఆయనతో కలిసి అనేక నేరాలకు పాల్పడిన అమర్ దుబే బుధవారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. వికాస్ దుబే కోసం ఆరు రోజుల నుంచి దాదాపు 100కిపై పోలీసు బృందాలు అణువణువునా గాలిస్తున్నప్పటికీ ఆచూకీ కూడా లభించకపోవడం గమనార్హం. 
 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos