Kulbhushan Jadhav: రివ్యూ పిటిషన్‌కు జాదవ్ నో, క్షమాభిక్షకే సుముఖత : పాక్

కుల్ భూషణ్ జాదవ్ పై పాక్ మరో వాదనకు తెరలేపింది. అయితే జాదవ్ రివ్యూ పిటిషన్ వేసేందుకు నిరాకరిస్తున్నాడని, గతంలో విధించిన మరణశిక్షకు సంబంధించి పెండింగ్ లో ఉన్న క్షమాభిక్ష వైపే మొగ్గు చూపుతున్నాడని పాక్ ఆరోపించింది.

Last Updated : Jul 8, 2020, 05:04 PM IST
Kulbhushan Jadhav: రివ్యూ పిటిషన్‌కు జాదవ్ నో, క్షమాభిక్షకే సుముఖత : పాక్

న్యూఢిల్లీ: కుల్ భూషణ్ జాదవ్ (Kulbhushan Jadhav) పై పాక్ మరో వాదనకు తెరలేపింది. అయితే జాదవ్ రివ్యూ పిటిషన్ వేసేందుకు నిరాకరిస్తున్నాడని, గతంలో విధించిన మరణశిక్షకు సంబంధించి పెండింగ్ లో ఉన్న క్షమాభిక్ష వైపే మొగ్గు చూపుతున్నాడని పాక్ ఆరోపించింది. కాగా గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను క్షేమంగా తీసుకురావాలని భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ అనుమానాస్పద రీతిలో కొత్త వాదన తెరపైకి తెచ్చింది. 

Also Read: Covid-19 First Vaccine: కరోనావైరస్ తొలి వ్యాక్సిన్ ఇతనికే

ఇదిలాఉండగా ఈ అంశంపై పాక్ అదనపు అటార్నీ జనరల్ మాట్లాడుతూ నేర నిరూపణ, మరణశిక్షకు సంబంధించి  సమీక్ష కోరుతూ రివ్యూ పిటిషన్ వేయాలని కుల్ భూషణ్ జాదవ్ కు అవకాశం ఇచ్చినప్పటికీ సుముఖత చూపలేదన్నారు. పెండింగ్ లో ఉన్న తన క్షమాభిక్ష పిటిషన్ పై వచ్చే నిర్ణయం కోసం ఎదురుచూడాలని నిర్ణయించుకున్నాడని వెల్లడించారు. ఇప్పటివరకు జాదవ్ కు రెండోసారి దౌత్యపరమైన సాయం అందించేందుకు పాక్ ప్రభుత్వం ముందుకొచ్చిందని పేర్కొన్నారు.

Also Read: టీమిండియాకు దూకుడు నేర్పిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ

 

గమనార్హం.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News