Rape threat: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్​ కొనేందుకు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు.. స్నేహితురాలిని రేప్​ చేస్తానని బెదిరించాడు ఓ (Young man Rape threat female friend) ప్రబుద్దుడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాలత్లోకి వెలితే..


కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన పీవీ నాగేశ్వర్​ అనే 25 ఏళ్ల యువ వ్యాపారుడు.. 24 ఏళ్ల తన స్నేహితురాలి పేరుమీద బ్యాంక్​లో రూ.80 వేలు లోన్​ తీసుకుని గత ఏడాది ఐఫోన్ కొనుగోలు (Loan for iPhone) చేశాడు.


మొత్తం మూడేళ్ల వరకు లోన్​ క్లియర్​ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడతడు. అయితే ఆ యువకుడు మాట తప్పాడు. ఈఎంఐలు చెల్లించడం మానేశాడు. దీనితో బ్యాంక్​ అధికారులు లోన్​ రికవరీ కోసం ఆ యువతికి ఫోన్లు చేయడం ప్రారంభించారు.


బ్యాంక్ అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని.. నాగేశ్వర్​కు ఫోన్ చేసి చెప్పింది యువతి. వెంటనే లోన్​ రీపేమెంట్ చేయాలని సూచించింది. అయితే స్నేహితురాలు తన ఇబ్బందులు చెప్పినా ఆ యువకుడు పెడ చెవిన పెట్టాడు. అలా ఎన్నిసార్లు ఫోన్​ చేసినా ఆ యువకుడు లోన్​ గురించి (Karnataka Youth Rape threat to Friend) పట్టించుకోలేదు.


చివరి సారిగా జనవరి 19న ఆ యువకుడికి కాల్​ చేసిన యువతి.. ఏలాగైనా లోన్​ రీపేమెంట్ చేయాల్సిందేనని పట్టుబట్టింది. దీనితో స్నేహితురాలిపై కోపం పెట్టుకున్న యువకుడు.. రేప్​ చేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దీనితో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.


ఉద్యోగం ఇప్పిస్తానని లోన్​..


ఆయితే ఘటనపై పోలీసులు విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి. నాగేశ్వర్​ తనకు ఐదేళ్లుగా తెలుసని ఆ యువతి చెప్పింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడని.. అందుకు బదులుగా ఐఫోన్ కొనేందుకు లోన్ తీసుకుని తనకు ఇవ్వాలని కోరాడని వివరించింది. ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఆ యువకుడు చెప్పినట్లుగానే.. తన పేరుపై రూ.80 వేలు లోన్​ తీసుకున్నట్లు (Young man cheated Female Friend for bank loan) తెలిపింది. తీరా లోన్​ తీసుకుని ఐఫోన్​ కొనుగోలు చేశాక.. ఇలా చేశాడని వాపోయింది ఆ యువతి.


యువకిడిపై కేసులు ఇలా..


యువతి ఫిర్యాదుతో ఆ యువకుడిని అరెస్ట్​ చేశారు కర్ణాటక పోలీసులు. ఆ యువకుడిపై ఐపీఎసీ సెక్షన్​ 354 ఏ (లైంగిక వేదింపులు), 504 (శాంతి భంగం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపులు), 509 (మహిళను అవమానించడం), 420 (మోసం) సెక్షన్​ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Also read: Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య


Also read: జేసీబీలో మండపానికి వెళ్లిన పెళ్లికొడుకు.. భిన్నంగా జరుపుకోవాలని మాత్రం కాదు! కారణం ఏంటంటే? (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook