Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యడ్యూరప్ప మనవరాలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2022, 03:34 PM IST
Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

Breaking News: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యడ్యూరప్ప మనవరాలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

కర్ణాటకలో తీవ్ర విషాదం. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రిలో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ యడ్యూరప్ప కార్యాలయం ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ వార్త విన్న వెంటనే అందరూ నిర్ఘాంతపోతున్నారు. చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకోవడమేంటనేది అర్ధం కావడం లేదు. ప్రస్తుతం యడ్యూరప్ప కుటుంబంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. 

సౌందర్య వృత్తిరీత్యా..వైద్యురాలు. ఇటీవలే ఆమెకు వివాహమైంది. బెంగళూరు సెంట్రల్ లో ఉంటున్న సౌందర్య గత కొద్దికాలంగా డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమెకు నాలుగు నెలల కుమార్తె ఉంది.  బీఎస్ యడ్యూరప్ప పెద్ద కుమార్తె పద్మావతి కూతురు సౌందర్య.

Also read: Covid Cases Updates: కరోనా కేసులు తగ్గినా.. కొవిడ్‌ మరణాలు మాత్రం తగ్గట్లే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News