Take Home Pay May Reduce from 2021:  వేతనాలు 2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. దాని ఫలితంగా ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సవరించిన వేతనాలు అందుకోనున్నారు. తాజా డ్రాఫ్ట్ మార్పులు అమలులోకి వస్తే నికర జీతం (Take Home Pay)లో కొంతమేర కోత పడే అవకాశముంది. ఉద్యోగికి కంపెనీ చెల్లించే అలవెన్సుల వాటా పూర్తి ప్యాకేజీలో 50శాతానికి మించరాదని తాజా ప్రతిపాదనలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తద్వారా ఏప్రిల్ 2021 ఆర్థిక సంవత్సరం నుండి ఉద్యోగుల నికర వేతనాల(Net Salary)లో కోత పడవచ్చు. ముసాయిదా నిబంధనలలో ఉద్యోగుల అలవెన్సు మొత్తాన్ని పూర్తి జీతంలో 50శాతంలోపే ఉండాలని, అంతకు మించరాదని మార్పులు చేయనున్నారు. ఉద్యోగుల యాజమాన్యాలు బేసిక్ శాలరీని 50 శాతంగా నిర్ణయించాల్సి వస్తుంది. దీంతో  ఉద్యోగి యొక్క గ్రాట్యుటీ మరియు పీఎఫ్ అమౌంట్ పెరుగుతుంది.


Also Read : Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు



కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నవంబర్ 13న సాంఘిక భద్రత 2020 కింద ముసాయిదా నియమాలను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగుల పీఎఫ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (EPFO), గ్రాట్యుటీ, మెటర్నిటీ బెనిఫిట్, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సామాజిక భద్రత మరియు సెస్, సామాజిక భద్రత కోసం సామాజిక భద్రత 2020 ముసాయిదాలోని నిబంధనలను అమలు చేయనున్నారు.


Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి    


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook