డిజిటల్ వినోద ప్రపంచంలో మరో సరికొత్త వేదిక `జీ 5`
ఫిబ్రవరి 14, 2018 నుండి జీ 5 సేవలు ప్రారంభమవనున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఒకే డిజిటల్ వ్యవస్థపైకి పైకి తీసుకువచ్చేందుకు ఈ సరికొత్త వేదిక ప్రారంభమైంది
జీ ఇంటర్నేషనల్‌తో పాటు జెడ్ 5 గ్లోబల్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్న శ్రీ అమిత్ గోయంకా బుధవారం నాడు జీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కి సంబంధించిన కొత్త డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారం జీ 5 ను అధికారికంగా ప్రారంభించారు.
ఫిబ్రవరి 14, 2018 నుండి జీ 5 సేవలు ప్రారంభమవనున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఒకే డిజిటల్ వ్యవస్థపైకి పైకి తీసుకువచ్చేందుకు ఈ సరికొత్త వేదిక ప్రారంభమైంది. ముఖ్యంగా డిజిటల్ మాధ్యమంగా సేవలను కోరుతున్న వీక్షకులకు మంచి కార్యక్రమాలను అందించడమే జీ 5 లక్ష్యం.
వివిధ భాషలకు చెందిన వీక్షకులకు సేవలందిస్తూ.. ఖండాంతరాలు కూడా దాటలన్న ఆలోచనతో జీ 5 పనిచేస్తోంది. "జీ 5 ప్రారంభంతో మేము అభివృద్దిలో తదుపరి దిశగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం" అని చెబుతూ తన అభిప్రాయాలు పంచుకున్నారు శ్రీ అమిత్ గోయంకా.
"డిజిటల్ రంగంలో మాదైన శైలిలో శక్తిమంతమైన ఉనికిని చాటేందుకే మేము ప్రయత్నిస్తున్నాం. ఓ గ్లోబల్ కంటెంట్ కంపెనీగా, మా వీక్షకులను అర్థం చేసుకొని.. వారికి కావాల్సిన కంటెంట్ అందివ్వడంలోనే మా విజయం ఆధారపడి ఉంటుంది. జీ 5 అందించే కంటెంట్ అటువంటిదే.
ముఖ్యంగా స్థానిక వీక్షకులకు కావాల్సిన కంటెంట్ ఏమిటో అర్థం చేసుకొని..అటువంటి కంటెంట్ ఇవ్వడానికి ఎల్లవేళలా జీ 5 ప్రయత్నిస్తుంది.జీ 5 ను చాలా సులువుగా ఎవరైనా వాడవచ్చు . అందుకుగాను అధునాతనమైన సాంకేతికతను మేము వాడడం జరిగింది.
లోకల్ కంటెంట్‌తో పాటు గ్లోబల్ కంటెంట్ కూడా ఇస్తున్న జీ 5... మీరు చూసే కార్యక్రమాల్లో మరింత నాణ్యతను అందించేందుకు ప్రయత్నిస్తోంది" అని సీఈఓ శ్రీ అమిత్ గోయంకా తెలిపారు.
"డిజిటల్ రంగంలో మాదైన శైలిలో శక్తిమంతమైన ఉనికిని చాటేందుకే మేము ప్రయత్నిస్తున్నాం. ఓ గ్లోబల్ కంటెంట్ కంపెనీగా, మా వీక్షకులను అర్థం చేసుకొని.. వారికి కావాల్సిన కంటెంట్ అందివ్వడంలోనే మా విజయం ఆధారపడి ఉంటుంది.
జీ 5 అందించే కంటెంట్ అటువంటిదే. ముఖ్యంగా స్థానిక వీక్షకులకు కావాల్సిన కంటెంట్ ఏమిటో అర్థం చేసుకొని.. అటువంటి కంటెంట్ ఇవ్వడానికి ఎల్లవేళలా జీ 5 ప్రయత్నిస్తుంది. జీ 5 ను చాలా సులువుగా ఎవరైనా వాడవచ్చు .
అందుకుగాను అధునాతనమైన సాంకేతికతను మేము వాడడం జరిగింది. లోకల్ కంటెంట్‌తో పాటు గ్లోబల్ కంటెంట్ కూడా ఇస్తున్న జీ 5... మీరు చూసే కార్యక్రమాల్లో మరింత నాణ్యతను అందించేందుకు ప్రయత్నిస్తోంది" అని తెలిపారు శ్రీ అమిత్ గోయంకా
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ పునిత్ గోయంకా మాట్లాడుతూ "ఒక శక్తిమంతమైన మీడియా మరియు వినోద పరిశ్రమగా మేము మరింత ఎదిగేందుకు జీ 5 తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. మిగతా డిజిటల్ వేదికలతో పోల్చుకుంటే విభిన్నమైన మరియు అధునాతనమైన ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ జీ 5 ప్రత్యేకత. జీ 5 లో కంటెంట్ కోసం మేము ఎంతో సమయాన్ని, ధనాన్ని వెచ్చించి మరీ మంచి నాణ్యతతో కూడిన కంటెంట్ వేదికను తయారుచేయడానికి ప్రయత్నించాము. ఈ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ దేశ విదేశాలల్లో ఉన్న మా ప్రేక్షకులు అందరికీ కనువిందు చేస్తుందని ఆశిస్తున్నాము" అని తెలిపారు.
జీ 5 గురించి
జీ 5 ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోద కార్యక్రమాలను వారు కోరిన సమయంలో వారు కోరుకున్నంత ఇవ్వడంతో పాటు లైవ్ టీవీ సేవలను కూడా అందిస్తోంది. దాదాపు 1,00,000 ఆన్ డిమాండ్ కంటెంట్ మీకు అందివ్వడానికి మేము ప్రయత్నించాము. ఇందులో ప్రత్యేక కార్యక్రమాలతో పాటు భారత, అంతర్జాతీయ చలనచిత్రాలు, టీవీషోలు, సంగీతం, ఆరోగ్యం, లైఫ్ స్టైల్‌కు సంబంధించిన వీడియోలు అన్ని భాషల్లో అందించడానికి ప్రయత్నించడం జరిగింది. దాదాపు 90 ప్లస్ పాపులర్ లైవ్ టీవీ ఛానళ్లు ఈ రోజు జీ 5 లో సిద్ధంగా ఉన్నాయి.
12 భాషల్లో వీక్షకులు జీ 5 కార్యక్రమాలను వీక్షించవచ్చు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, కన్నడం, మరాఠీ, ఒరియా, భోజ్‌పూరి, గుజరాతీ, పంజాబీ భాషల్లో నేడు జీ 5 కంటెంట్ అందుబాటులో ఉంది. భారతదేశంలో ఇన్ని భాషల్లో సేవలందిస్తున్న ఏకైక ఓటిటి ప్లాట్‌ఫారమ్ జీ 5 మాత్రమే.
జీ 5 ప్రత్యేకతలు
*భారతదేశంలో తొలిసారిగా వాయిస్ సెర్చ్‌తో డిజిటల్ సేవలు అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ జీ 5 మాత్రమే.
*అదే విధంగా జీ 5 ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌గా కూడా సేవలందిస్తోంది. ఈ యాప్ వల్ల ఫోన్‌లో స్టోరేజ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా జీ 5 సేవలు వీక్షకులకు అందుతాయి
*యాప్ డౌన్లోడ్ చేసుకోకపోయినా.. వీక్షకులకు అత్యుత్తమ యాప్‌ను చూస్తున్న అనుభూతి వెబ్ అప్లికేషన్‌లో సైతం కనిపిస్తోంది
*వైఫై ద్వారా కంటెంట్ డౌన్లోడ్ చేసుకొని.. తర్వాత కూడా చూసే సౌకర్యం జీ5 లో వీక్షకులకు అందుబాటులో ఉంది
*క్రోమ్ కాస్ట్, ఎయిర్ ప్లే సపోర్టు, వాచ్ లిస్ట్, రిమైండర్ ఆప్షన్, టీవీ గైడ్ మొదలైన అదనపు సౌకర్యాలు కూడా జీ 5 యాప్ ద్వారా పొందవచ్చు
*జీ 5 యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా www.zee5.com వెబ్‌సైట్ ద్వారా మా కార్యక్రమాలు వీక్షించవచ్చు
ధరలు
జీ 5 కంటెంట్‌లో పలు వీడియోలను ఉచితంగానూ, పలు వీడియోలను రుసుము చెల్లించి చూడవచ్చు. జీ 5 కంటెంట్ పూర్తిస్థాయిలో చూడాలనుకొనే వారు నెలవారీ ఛార్జీలు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్పెషల్ లాంచ్ ఆఫర్ ధరగా ప్రస్తుతం రూ.99 రూపాయలు మాత్రమే ఛార్జి చేయడం జరుగుతోంది