ZEEL, Sony merger announcement latest updates: సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్ ఇండియాతో విలీనం ఒప్పందానికి దిగ్గజ మీడియా కంపెనీ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బోర్డ్ ఆమోదించింది. ఈ మేరకు జీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ అంగీకారాన్ని తెలిపారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్‌ నెట్ వర్క్ ఇండియా (ZEEL, Sony merger) తీసుకున్న ఈ విలీనం ఒప్పందంతో మీడియా కార్పొరేట్ ప్రపంచంలో కీలక పరిణామం చోటుచేసుకుందనే చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీల్ (ZEEL) తీసుకున్న ఈ నిర్ణయానికి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విలీనంతో ఏర్పడే సంస్థకు ఐదేళ్ళపాటు ఎండీ, సీఈఓగా పునీత్‌ గోయెంక (Puneet Goenka) కొనసాగనున్నారు. విలీనం అనంతరం పునీత్ గోయెంక సంస్థలో 157.5 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఈ విలీనంతో కంపెనీ వాటాదారులందరితో పాటు సంస్థకి చెందిన అందరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నట్టు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది. 


Also read : Amazon Legal Issues: ఇండియాలో అమెజాన్ వివాదాలు, లీగల్ ఫీజులు ఫీజులు కోట్లలో


అంతేకాకుండా ఈ రెండు కంపెనీల విలీనంతో దక్షిణాసియాలోనే అధిక వృద్ధిని సాధించే సంస్థగా ఎదగడమే తమ లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్టు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEE Entertainment Enterprises) స్పష్టంచేసింది. జీ ఎంటర్‌టైన్మెంట్, సోని పిక్చర్స్ విలీనంతో రెండు కంపెనీలకు చెందిన కంటెంట్‌ని షేర్ చేసుకునే సౌలభ్యం ఏర్పడటంతోపాటు ఇరు పార్టీలకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే భారత్‌లో సోనీ తన ఉనికిని మరింత పెంచుకునే అవకాశం కూడా కలగనుంది.


ZEEL Business - జీ ఎంటర్‌టైన్మెంట్ వ్యాపారం:
ZEEL 190 దేశాలలో 10 భాషలలో, 100 కంటే ఎక్కువ ఛానెల్స్‌తో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోంది. జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఆడియెన్స్ మార్కెట్‌లో 19 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. 2.6 లక్షల గంటల కంటే ఎక్కువ టీవీ కంటెంట్ కలిగి ఉంది. డిజిటల్ మార్కెట్‌లోనూ జీ 5 ఓటిటి ప్లాట్‌ఫామ్ (Zee5) ద్వారా ఎక్కువ రీచ్ ఉంది. అన్నింటికి మించి దేశంలో 25 శాతం సినిమాలు జీ నెట్‌వర్క్‌ చేతిలోనే ఉండటం మరో విశేషం.


Also read : Elon Musk: మరో వివాదంలో ఎలాన్ మస్క్, గిగా ఫ్యాక్టరీ ఇండియాకు రానుందా


Sony Business - సోనీ వ్యాపారం:
సోనీ బిజినెస్ విషయానికొస్తే.. భారత్‌లో ఆ సంస్థకు 31 ఛానెల్స్ ఉండగా ఆయా ఛానెల్స్‌కి ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలలో రీచ్ ఉంది. సోనీ దేశంలో 700 మిలియన్ల మంది వీక్షకులను కలిగి ఉంది. ఇది ఆడియెన్స్ మార్కెట్‌లో 9 శాతం వాటాకు సమానం.


Also read : 5G Internet Trials: వోడాఫోన్ ఐడియా మెరుపువేగంతో డేటా బదిలీ, త్వరలో 5జీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook