ZEEL-Sony merger, ZEEL shares prices, EPS: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ విలీనంతో స్టాక్ మార్కెట్‌లో జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్స్‌కి భారీ డిమాండ్ కనిపించింది. విలీనానికి జీ ఎంటర్‌టైన్మెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించినట్టుగా ప్రకటన వెలువడిన అనంతరం బుధవారం జీల్ షేర్స్‌లో 25 శాతం వృద్ధి నమోదైంది. గత 52 వారాల గరిష్ట స్థాయిలో బాంబే స్టాక్ ఎక్సేంజీలో జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్ ధర 319.5 కి (ZEEL share's prices) పెరిగింది. ఈ విలీనం వెనుక ఆర్థికపరమైన కారణాలు మాత్రమే కాకుండా సంస్థాగతంగా, వాణిజ్యం పరంగా వ్యూహాత్మక అంశాలు ఎన్నో ఉన్నాయని జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ విలీనాన్ని మార్కెట్ ఎనలిస్ట్ సిద్ధాంత్ సెడాని ఒక లాభదాయకమైన ఒప్పందంగా అభివర్ణించారు. క్రీడాంశాల్లో సోనీ వద్ద ఎంతో కంటెంట్ ఉంది. అలాగే ప్రాంతీయంగా వినోదాత్మక కంటెంట్‌లో జీ ఎంటర్‌టైన్మెంట్ (ZEE entertainment channels) ఎంతో ధృడంగా ఉంది. అన్నింటికిమించి ఈ రెండు సంస్థలకు కూడా భారీ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ (OTT) ఉన్నాయి. ఆ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ కూడా ఈ విలీనంతో ఏకమవుతుండటంతో నెట్‌ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌కి గట్టి పోటీ ఇచ్చినట్టే అవుతుంది. కంటెంట్ క్రియేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు మరింత సౌలభ్యం ఏర్పడుతుందని సిద్ధాంత్ అభిప్రాయపడ్డారు.


జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ విలీనం (ZEEL, Sony merger) గురించి ట్రేడ్‌స్విఫ్ట్ డైరెక్టర్ సందీప్ జైన్ మాట్లాడుతూ.. మీడియా ప్రపంచంలో ఇదొక కీలక పరిణామంగా పేర్కొన్నారు. జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ విలీనంతో ఎంటర్‌టైన్మెంట్, మీడియా ఇండస్ట్రీకి కొత్త అర్థాన్ని నిర్వచిస్తాయని, అలాగే మీడియా స్టాక్స్‌పై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని అన్నారు. ప్రపంచంలో సోనీ మీడియా లీడర్ అయితే, ఇండియాలో జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (ZEEL) మీడియా దిగ్గజం కనుక ఈ విలీనం రెండు కంపెనీలకు వృద్ధిపరంగా కలిసొచ్చే అంశమే అవుతుందని జైన్ తెలిపారు.


మరో మార్కెట్ ఎక్స్‌పర్ట్ వరిందర్ బన్సల్ మాట్లాడుతూ.. జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ విలీనం మంచి కలయిక అవుతుంది అని అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి వాటాదారులు పొందే ఆదాయం (ZEEL shares EPS) 25-30 రెట్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ధీమా వ్యక్తంచేశారు. 


(గమనిక: జీ ఎంటర్‌టైన్మెంట్ (Zee Entertainment) మా గ్రూప్ కంపెనీ కాదు. మా రెండు సంస్థల పేర్లు పలకడానికి ఒకేలా అనిపించినప్పటికీ.. మా ఈ సంస్థకు జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (Zee Media Corporation) యజమానిగా వ్యవహరిస్తుందనే విషయాన్ని గమనించాల్సిందిగా మనవి)