PM Modi-Tedros: WHO బాస్‌కు కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ.. ఏంటో తెలుసా?
PM Modi: గుజరాత్ లో ఆయుష్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.
PM Modi gives Gujarati name to WHO director general: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రెయెసస్ అధనోమ్‌కు (Dr Tedros Ghebreyesus) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొత్త పేరు పెట్టారు. గాంధీనగర్‌లో జరుగుతున్న మూడు రోజుల గ్లోబల్ ఆయూష్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. టెడ్రోస్‌ను 'తులసీ భాయ్'గా (tulsibhai) పిలిచారు మోదీ. తులసి మొక్క భారత ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమని.. తరతరాలుగా పూజలు చేస్తున్నామని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. డాక్టర్ గెబ్రెయెసస్ ఈ రోజు ఉదయం తనను కలిసినప్పుడు పక్కా గుజరాతీ పేరు కావాలని అడిగినట్లు ప్రధాని చెప్పారు.
ప్రభుత్వ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆవిష్కరిస్తుందంటూ డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ (WHO director general) ప్రశంసించారు. సంప్రదాయ వైద్య విధానాలను కాపాడుకోవడంలో ఇండియాను ఛాంపియన్‌గా అభివర్ణించారు గెబ్రెయెసస్. ఆయుర్వేద రంగంలో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయన్న మోదీ...ఔషధ మొక్కలకు ఇండియా పుట్టినిల్లుగా పేర్కొన్నారు. ఆయుర్వేదాన్ని గ్రీన్ గోల్డ్‌గా ప్రధాని (narendra modi) పేర్కొన్నారు. ఆయుష్ ఉత్పత్తి చేస్తున్న మందులు 150కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రధాని వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook