Pre Workout : ఖాళీ కడుపుతో వ్యాయామం వద్దు.. ఇలా చేస్తేనే మేలు
Reasons Why You Should Eat Before Your Workout : ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌తో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. చాలా మంది ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేస్తుంటారు. అలా చేయొద్దంటున్నారు నిపుణులు.
3 Important Reasons Why You Should Eat These Foods Before Your Workout : రోజూ వ్యాయామం చేసే వాళ్లు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా డైట్ పాటించాలి. ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌తో (Exercise) పాటు మంచి పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. చాలా మంది ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేస్తుంటారు. కానీ వర్క్ అవుట్స్‌కు (Workouts) ముందు కాస్త ఫుడ్ తీసుకోవాలంటున్నారు నిపుణులు.అయితే వ్యాయామం చేయడానికి ముందు తీసుకోవాల్సిన ఫుడ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రఖ్యాత పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బత్రా (Lovneet Batra) వివరించారు.
"వర్కవుట్ చేయడం వల్ల బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. కండరాలు (Muscles) ఉత్తేజమవుతాయి.. అయితే వర్కవుట్ సెషన్‌లు కొన్నిసార్లు కాస్త కఠినంగా కూడా ఉంటాయి. చాలా కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. దీంతో వర్కవుట్ సెషన్‌లకు ముందు బాడీకి కాస్త ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది." అంటూ లోవ్‌నీత్ పేర్కొన్నారు.“అయితే వ్యాయామానికి ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు.. చాలా తక్కువగా తీసుకోవాలి." అని లోవ్‌నీత్ ఆ పోస్ట్‌లో తెలిపారు.
Also Read : పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు
వర్కౌట్‌కు ముందు ఆహారం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చాలా మంది వర్క్ అవుట్ చేసే సమయంలో హైపోగ్లైసీమియా (hypoglycemia) లేదా లో బ్లడ్ షుగర్ వంటి వాటి బారినపడుతుంటారు. దీంతో తలతిరగడం, అలసట వంటి ఇబ్బందులకు గుర అవుతారు. అయితే వర్క్ అవుట్‌కు ముందు కాస్త పోషకాహారం తీసుకుంటే అలాంటి సమస్యలేవీ ఎదురుకావు.
వ్యాయామానికి ముందు కొంత ఆహారం (Pre-Workout Food) తీసుకోవడం వల్ల కడుపులో ఎలాంటి యాసిడ్స్ ఏర్పడవు.
అలాగే కండరాలకు మంచి శక్తి అందుతుంది. వర్క్ అవుట్ సమయంలో ఉత్తేజంగా ఉండే కండరాలకు నేరుగా శక్తి అందేందుకు తోడ్పతుంది.
అయితే వ్యాయామానికి ముందు అల్పహారంగా పండ్లు తీసుకుంటే చాలా మంచిది. అవి త్వరగా జీర్ణం కావడంతో పాటు మంచి శక్తిని ఇస్తాయి.
Also Read : Gurugram: కదులుతున్న ఆటో నుంచి దూకేసిన మహిళ.. భయానక అనుభవం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి