Ajwain Benefits: వాము నీటిని ఇలా తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు..
Ajwain Water Benefits: వాముతో మనకు ఎన్నో ఏళ్లుగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చెబుతారు. ఇది దగ్గు, జలుబు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. దీని వాసన ఘాటుగా ఉంటుంది. కొన్ని వంటల్లో కూడా వామును వినియోగిస్తారు.
Ajwain Water Benefits: వాముతో మనకు ఎన్నో ఏళ్లుగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చెబుతారు. ఇది దగ్గు, జలుబు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. దీని వాసన ఘాటుగా ఉంటుంది. కొన్ని వంటల్లో కూడా వామును వినియోగిస్తారు. అయితే వాముతో మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
జీర్ణక్రియ..
వాముని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు అవుతుంది. అంతేకాదు కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇందులో యాక్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైలీ రొటీన్ లో వాము చేర్చుకోవడం మంచిది. అంతేకాదు వాము, జీలకర్ర, అల్లం వేసిన నీటిని తీసుకుంటే గుండె మంట కూడా తగ్గుతుంది.
జలుబు..
వాము ముక్కు గాలి మార్గాలను కూడా సరిచేస్తుంది. జలుబు, దగ్గు రొంపతో బాధపడేవారు వాము తీసుకోవాలి. ఆస్తమాతో బాధపడే వారికి కూడా ఇది పనిచేస్తుంది. వాము, బెల్లం పేస్టు తయారు చేసుకుని ప్రతిరోజు రెండు సార్లు తీసుకుంటే ఎఫెక్టీవ్ రెమిడీగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: ఇత్తడి వస్తువులను ఇంట్లోని ఈ ఒక్క వస్తువుతో క్లీన్ చేస్తే తళతళా మెరిసిపోతాయి..
చెవి, పన్నునొప్పి..
చెవి లేదా పంటి నొప్పితో బాధపడేవారు వాము నూనె రెండు చుక్కలు వేయడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వాము తో పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. ఉప్పు, వాము వేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి. వాముతో పొగ వేసుకోవడం వల్ల కూడా వల్ల కూడా పన్ను నొప్పి తగ్గుతుంది.
చర్మ ఆరోగ్యం..
పాములో తైమోల్ ఉంటుంది. ఇది ఫంగీ సైడ్ గా పనిచేస్తుంది స్కిన్ ఇన్ఫెక్షన్ లో బారిన పడకుండా గాయాలు మార్చడానికి సహాయపడుతుంది, ప్రాంతంలో రుద్దాలి.
మహిళలకు వరం..
అజీర్తితో బాధపడే మహిళలకు వాము ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. కడుపుతో ఉన్న సమయంలో లేదా పీరియడ్స్ లో వాము తీసుకోవడం వల్ల నొప్పి సమస్య తగ్గుతుంది.
బరువు తగ్గుతారు..
ప్రతిరోజు ఉదయం పడిగడుపున వామునీటిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది.
ఇదీ చదవండి: ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో తెలుసా?
తెల్ల వెంట్రుకలు..
వాము తీసుకోవడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్య కూడా తగ్గిపోతుంది. ఒక కరివేపాకు వేసి కాస్త చక్కెర నీరు కలిపి తీసుకోవటం వల్ల గ్రే హెయిర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
దోమలు..
వాము గింజలను మస్టర్డ్ ఆయిల్ నూనెతో కలిపి ఒక కార్డు బోర్డు కు అప్లై చేయడం వల్ల ఇది మస్కిటో రెప్పల్లెంట్ గా పనిచేస్తుంది అంతేకాదు ఇది మంచి ఆరోమా కూడా ఇస్తుంది.
కీళ్ల నొప్పులు..
అంతేకాదు వాము యాంటీ ఇన్ల్ఫమేషన్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ తో బాధపడే వారికి ఎఫెక్టీవ్ రెమెడీ. స్నానం చేసే నీటిలో వాము గింజలు వేసి మరిగించుకొని స్నానం చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి