Brass Utensils Cleaning Tips: పూజ గది వస్తువులు లేదా ఇంట్లో ఉండే ఇతడి వస్తువులను తోమడం అంటే పెద్ద తలనొప్పి తో కూడుకున్నది. దీనికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే పూర్వకాలం నుంచి ఇత్తడి వస్తువులను విరివిగా వాడేవారు. ఇత్తడి వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ వస్తువులను కొన్ని ఇంటి చిట్కాలతో ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.
నిమ్మకాయ, ఉప్పు..
సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఇత్తడి వస్తువులను తళతళా మెరిపించవచ్చు. దీనికి నిమ్మరసం, ఉప్పు, డిష్ వాష్ బాగా మిక్స్ చేసి అర చెక్క నిమ్మకాయతో ఈ ఇత్తడి వస్తువులను రబ్ చేస్తూ ఉండాలి. ఓ పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
బేకింగ్ సోడా, వెనిగర్..
మరో సింపుల్ టిప్ ఏంటంటే ఇత్తడి వస్తువులను శుభ్రం చేయాలంటే ఇంట్లో ఉండే బేకింగ్ సోడా వెనిగర్ ఉంటే చాలు ఈ రెండిటిని పేస్ట్ మాదిరి తయారు చేసుకొని ఇత్తడి వస్తువులకు బాగా అప్లై చేసి ఒక 15 నిమిషాల వరకు కెమికల్ రియాక్షన్ జరిగే వరకూ అలాగే ఉంచండి. ఆ తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తో స్క్రబ్ చేస్తూ ఉంటే క్లీన్ అయిపోతాయి.
ఇదీ చదవండి: గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఈ 6 ఆహారాలు మీ డైట్ లో ఉంటే బరువు పెరిగే ఛాన్స్ లేదు..
టమాటా కెచప్..
కొద్దిగా టమాటా కెచప్ తీసుకొని కూడా ఇత్తడి వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ పై కెచప్ వేసుకొని ఇత్తడి వస్తువులను 15 నిమిషాల పాటు రబ్ చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
వెనిగర్, పిండి..
ఈ రెండు వస్తువులు కూడా నిత్యం ఇంట్లో అందుబాటులో ఉంటాయి. పాత బట్ట ఇత్తడి వస్తువులను శుభ్రం చేసుకోవడానికి పిండి, వెనిగర్ రెండు పేస్టు మాదిరి కలుపుకోవాలి. ఇతడు వస్తువులకు వీటిని అప్లై చేసి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మంచి గుడ్డ తీసుకొని వీటిని క్లీన్ చేయాలి.
నిమ్మరసం, బేకింగ్ సోడా..
రెండిటిని సమపాళ్లలో తీసుకొని ఒక సొల్యూషన్ తయారు చేసుకోవాలి. ఇందులో ఒక అరగంట పాటు ఇత్తడి వస్తువులను నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రష్ సాయంతో వీటిని క్లీన్ చేయాలి దీంతో ఇత్తడి వస్తువులు మెరిసిపోతాయి.
ఇదీ చదవండి: పీయర్ పండు తింటే ఈ ఆరోగ్య సమస్యలు మీ దరిదాపుల్లోకి రావు..
ఆలివ్ ఆయిల్, వెనిగర్..
ఈ ఆలివ్ ఆయిల్ ను వెనిగర్ ని రెండిటిని సమపాళ్లలో కలిపి ఒక స్ప్రే బాటిల్ లో తీసుకోవాలి. ఈ సొల్యూషన్ పాతబడ్డ ఇత్తడి వస్తువులపై స్ప్రే చేస్తూ మంచి క్లాత్ తో రబ్ చేయాలి. దీంతో ఇత్తడి వస్తువులు మెరిసిపోతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి