Orange Juice: ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో తెలుసా?

Orange Juice Benefits: ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రెగ్యులర్ గా ఆరెంజ్ తీసుకోవడం వల్ల మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 14, 2024, 04:12 PM IST
Orange Juice: ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో తెలుసా?

Orange Juice Benefits: ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రెగ్యులర్ గా ఆరెంజ్ తీసుకోవడం వల్ల మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. సాధారణంగా ఆరెంజ్ అంటేనే ఈ మానవులకు వరం. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న విటమిన్స్, న్యూట్రియెంట్ మన శరీరానికి అందుతాయి. అంతే కాదు ఇందులో పొటాషియం శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ ఉదయమే తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పుల్లపుల్లని జ్యూస్‌ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్‌ వారికి కూడా ఇవి ఎంతో మంచివి, అయితే, రెగ్యులర్‌గా ఆరేంజ్‌ జ్యూస్‌ తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు అవి ఏంటో తెలుసుకుందాం.

పోషకాలు పుష్కలం..
ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో పొటాషియం మెగ్నీషియం కూడా ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపడేలా చేస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్ పిండం అభివృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: పీయర్‌ పండు తింటే ఈ ఆరోగ్య సమస్యలు మీ దరిదాపుల్లోకి రావు..

యాంటీ ఆక్సిడెంట్స్..
ఆరెంజ్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆక్సిడెటీవ్ రాకుండా నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అంటే గుండె సమస్యలు, క్యాన్సర్, డయాబెటిస్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి.

కిడ్నీ స్టోన్స్..
ఆరెంజ్ జ్యూస్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడకండా నివారించే గుణం ఉంది. అధిక ఆల్కలైన్ లా మారుస్తుం, యూరిన్ ఆల్కలైన్ పి హెచ్ లెవెల్స్ ని సమతుల్యం చేసి కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది.

బూస్ట్ ఇమ్యూనిటీ..
ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. విటమిన్ సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇమ్యూన్ సెల్స్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

ఇదీ చదవండి: ఇత్తడి వస్తువులను ఇంట్లోని ఈ ఒక్క వస్తువుతో క్లీన్ చేస్తే తళతళా మెరిసిపోతాయి..

జీర్ణ క్రియ...
వెబ్ ఎండీ నివేదిక ప్రకారం ఆరెంజ్ జ్యూస్ పల్ప్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే మంచి ఫైబర్ మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది జన సమస్యలు రాకుండా నివారిస్తుంది ముఖ్యంగా డయాబెటిస్ గుండె సమస్యలు క్యాన్సర్ ఉన్నవాళ్లు ఆరెంజ్ తో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News