Dry Itchy Skin In Winter Home Remedies: శీతాకాలంలో వాతావరణంలోని తేమ పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటాయి. దీని కారణంగా చాలామంది చర్మ సమస్యల బారిన పడుతూ ఉంటారు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం రసాయనాలతో కూడిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను ఈ చలికాలంలో వినియోగించడం వల్ల చర్మం పొడిబారడమే కాకుండా ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చలికాలంలో చర్మంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఈ సమస్యను మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలామంది చర్మ సమస్యలతో బాధపడేవారు మార్కెట్లోని లభించే ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. వీటిని వినియోగించినప్పటికీ  చాలామంది ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా ఎలాంటి ఖర్చులు లేకుండా సహజమైన చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఖరీదైన లోష‌న్ల‌ను, మాయిశ్చ‌రైజ‌ర్ల‌కు బదులుగా చలికాలంలో చర్మానికి కొబ్బరినూనె వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ నూనె వాడటం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. 


కొబ్బరి నూనెలో లభించే యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ ఇన్ ప్లామేష‌న్ లక్షణాలు చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతాయి. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కారణంగా వచ్చే చర్మ సమస్యల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో చర్మానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల దురద, సోరియాసిస్ వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. దీంతోపాటు చర్మ సమస్యల కారణంగా వచ్చి ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు


శీతాకాలంలో చర్మానికి కలబంద జెల్ కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ జెల్ ను క్రమం తప్పకుండా చర్మానికి వినియోగించడం వల్ల దుర‌ద‌, తామ‌ర‌ వంటి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా డ్యామేజ్ అయిన చర్మం కూడా మెరుగుపడుతుంది. అయితే శీతాకాలంలో చాలామందిలో చర్మం ఎరుపు రంగులోకి మారుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి కూడా కలబంద జెల్ ప్రభావవంతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మం పొడిగా మారడాన్ని తగ్గిస్తాయి.


Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి