Amazing Health Benefits Of Walking On Grass: పిల్లలను, యువతను చెప్పులు లేకుండా నడవమని సూచిస్తారు. ప్రతి రోజు పచ్చగడ్డిలో నడవడం వల్ల అరికాళ్లతో పాటు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గడ్డిపై చెప్పులు లేకుండా నవడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అనేక రకాల శరీర బెనిఫిట్స్‌ లభిస్తాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు నడవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి రోజు గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాపు, నొప్పి నుంచి ఉపశమనం:
ఆకుపచ్చ గడ్డిలో ప్రతి రోజు నవడం వల్ల  శరీరంలో వాపు, నొప్పి నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తరచుగా గాయపడేవారు ప్రతి రోజు ఆకుపచ్చని గడ్డిలో నడవడం వల్ల నొప్పి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. ఇవే కాకుండా శరీరానికి విశ్రాంతి కూడా లభిస్తుంది. 


నిద్రలేమి సమస్యలకు..
ఇటీవలే చేసిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రతి రోజు పచ్చగడ్డిలో 20 నుంచి 40 నిమిషాల పాటు నడవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


కంటి చూపు మెరుగుపడుతుంది:
పాదలకు శరీరంలోని ఇతర అవయవాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. అయితే పచ్చి గడ్డిలో పాదాలతో నవడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఒత్తిడి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


ఒత్తిడి, ఆందోళనకు చెక్‌:
ప్రతి రోజు ఉదయం పూట పచ్చని గడ్డిలో చెప్పులు లేకుండా నడవడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో శరీరానికి తగినంత ఆక్సిజన్ లెవల్స్‌ అందుతాయి. ఒత్తిడి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


రక్తపోటు సమస్యలను తగ్గింస్తుంది:
తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పచ్చి గడ్డిలో ఒక గంట పాటు చెప్పులు లేకుండా నడవడం సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర ఒత్తిడి నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి