Amla Hair Care Tips: ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు కావాలా.. వారానికి రెండుసార్లు ఇలా చేయండి!
Apply Amla Water twice in a week for Black, Strong hair like Actress Aishwarya Rai. వారానికి రెండుసార్లు జుట్టుకు ఆమ్లా నీటిని అప్లై చేస్తే.. ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
Apply Amla Water twice in a week for Black and Strong hair like Actress Aishwarya Rai: 'ఉసిరి' ఒక మంచి ఆయుర్వేద మూలిక. ఆయుర్వేద వైద్యంలో ఉసిరి ఎంతో పేరొంది. చాలా అనారోగ్య సమస్యలను తగ్గించగల మంచి ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉసిరిలో విటమిన్-ఇ, విటమిన్-సి మరియు టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి కాయ కేవలం అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా.. జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది. ముఖ్యంగా తెల్ల జుట్టుతో బాధపడేవారికి ఉసిరి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
జుట్టుకు ఉసిరి నీటిని మర్దించడం ద్వారా మీ స్కాల్ప్‌లో మెలనిన్ పెరుగుతుంది. ఇది తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో మీకు సహాయపడుతుంది. దీనితో పాటు ఉసిరి నీరు చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. ఇది మాత్రమే కాదు.. ఉసిరి నీరు మీ జుట్టుకు బలాన్ని మరియు మెరుపును ఇస్తుంది. వారానికి రెండుసార్లు జుట్టుకు ఆమ్లా నీటిని అప్లై చేస్తే మంచిది. కాబట్టి జుట్టుకు పెట్టే ఆమ్లా నీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఉసిరి నీటిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు:
ఉసిరి పొడి- 1 టేబుల్ స్పూన్
నీరు- 3 పెద్ద కప్పులు
ఉసిరి నీటిని తయారు చేసే విధానం:
ఉసిరికాయ నీటిని తయారు చేయడానికి.. ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఉసిరి పొడి వేసి బాగా కలపాలి. ఇనుప పాత్రలో ఈ నీటిని రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేయండి. అంతే ఆమ్లా నీరు సిద్ధం.
ఆమ్లా నీటిని జుట్టుకు ఎలా ఉపయోగించాలి:
ఉసిరి నీటిని మీ జుట్టుకు బాగా పట్టించండి. మర్దన చేయండి. 1 గంట తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం కోసం మీరు ఈ నీటిని వారానికి కనీసం 2 నుండి 3 సార్లు ఉపయోగించాలి. ఇలా చేస్తే.. ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు మీ సొంతమవుతుంది.
Also Read: DC Captain: రిషబ్ పంత్ ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్! కీపర్ ఎవరో తెలుసా
Also Read: ICC T20 Rankings: 40 స్థానాలను ఎగబాకిన దీపక్ హుడా.. టాప్ 10లో ఒక్క ఇండియన్ ప్లేయర్ లేడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.