Anjeer: ఈ సమస్యలతో బాధపడేవారు అంజీర్‌ను ఖాళీ కడుపుతో తింటే బోలెడు లాభాలు
Anjeer Health Benefits: అంజీర్ ఒక అద్భుతమైన డ్రై ఫూట్. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దీని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Anjeer Health Benefits: అంజీర్ ఒక ఆరోగ్యకరమైన పండు. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇది చూడడానికి ఎంతో చిన్నగా ఉంటుంది. అంజీర్‌ను తాజాగా లేదా ఎండబెట్టి తినవచ్చు. అంజీర్‌లో కాల్షియం, పొటాషియం, మోగ్నీషియం, ఐరన్ ఉంటుంది. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులోని విటమిన్ ఎ, కే, బి6 కంటి చూపు ఇతర లాభాలకు సహాయపడుతాయి. అయితే ప్రతిరోజు అంజీర్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో? ఖాళీ కడుపుతో అంజీర్ తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
ఖాళీ పొట్టతో అంజీర్‌లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
అంజీర్‌ను తినడం వల్ల ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతాయి. దీని వల్ల గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యల ఉన్నవారు ప్రతిరోజు ఒక అంజీర్ పండు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు తినడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. కీళ్ళ సమస్యలతో బాధపడేవారు ఎముకల నొప్పి ఉన్నవారు కూడా దీని తీసుకోవచ్చు. దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. రోగనిరోధక శక్తి తక్కవగా ఉన్నవారు ప్రతిరోజు ఒక పండు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీని వల్ల హానికరమైన వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. అంజీర్‌లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారంలో అంజీర్‌లను చేర్చుకోవడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి . అంజీర్‌లు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ముడతలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
అంజీర్ ఎలా తీసుకోవచ్చు:
అంజీర్‌ను శుభ్రంగా కడిగి, చర్మంతో సహా తినవచ్చు. లేదా అంజీర్‌ను రాత్రి పూట పాలలో నానబెట్టి ఉదయం తీసి తినవచ్చు. ఇది మలబద్దకం నివారణకు చాలా మంచిది. అంజీర్‌ను పండ్లతో కలిపి స్మూతీలు తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. దీని కేకులు, బ్రెడ్‌లు, మఫిన్‌లు వంటి బేకింగ్ వస్తువుల్లో వాడవచ్చు. అంజీర్‌ను సలాడ్‌లలో కూరగాయలు, గింజలతో కలిపి తినవచ్చు.
ఎప్పుడు తినాలి:
ఉదయం: ఉదయం పరగడుపున అంజీర్‌ను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రాత్రి: రాత్రి పూట పాలలో నానబెట్టి తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.
గమనిక:
అంజీర్‌ను మితంగా తీసుకోవడం మంచిది. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడానికి దారితీయవచ్చు. షుగర్ ఉన్నవారు వైద్యుని సలహా తీసుకొని తీసుకోవాలి.
Also read: Almonds Unpeeled: బాదం పప్పును పొట్టు తీసి తినాలా..తీయకుండానా? నిపుణులు ప్రకారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter