Apple Cider Vinegar Benefits: యాపిల్ సైడర్ వెనిగర్ అద్భుత లాభాలు.. చాలా స్పీడ్‌గా బరువు తగ్గుతారు..
Apple Cider Vinegar Benefits: యాపిల్ సైడర్ వెనిగర్‌ను పులియబెట్టి తయారు చేస్తారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా జీర్ణ ఆరోగ్యంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్వహిస్తుంది.
Apple Cider Vinegar Benefits: సాధారణంగా వెనిగర్‌ను వివిధ వంట్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా చైనీస్ డిషెస్‌లో ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే, వెనిగర్ రాత్రి పడుకునే సమయంలో తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? వెనిగర్‌లో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.
యాపిల్ సైడర్ వెనిగర్‌ను పులియబెట్టి తయారు చేస్తారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా జీర్ణ ఆరోగ్యంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్వహిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ శరీర ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.
జీర్ణక్రియ..
యాపిల్ సైడర్ వెనిగర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ జీర్ణక్రియ ప్రక్రియకు తోడ్పడుతుంది. ఎసిటిక్ యాసిడ్ ఏసీవీ లో ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తికి ప్రేరేపిస్తాయి. ఇది ఆహారాన్ని విడగొట్టడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
షుగర్ నిర్వహణ..
యాపిల్ సైడర్ వెనిగర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఏసీవీ తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు నిర్వహిస్తాయి. రాత్రి సమయంలో కూడా షుగర్ నిర్వహించేలా చేస్తుంది. చాలామందికి ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. ఈ ఏసీవీ వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది మెటబాలిక్ ఆరోగ్యానికి సహాయపడతుంది.
ఇదీ చదవండి: ఉదయం ఖాళీ కడుపున ఈ డ్రింక్ తాగితే బరువు సులభంగా తగ్గుతారు..
బరువు నిర్వహణ..
ఏసీవీ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల అతిగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో అనారోగ్యపు ఆహారాలు తీసుకోకుండా ఉంటాం. బరువు పెరగకుండా ఉంటారు. యాపిల్ సైడర్ వెనిగర్ కొన్ని నివేదికల ప్రకారం మెటబాలిజం రేటును బూస్ట్ చేస్తుంది. కేలరీలు బర్న్ చేస్తుంది.
చర్మ ఆరోగ్యం..
రోజూ రాత్రి పడుకునే ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. ఇందులో డిటాక్సిఫై గుణాలు కూడా ఉంటాయి. అంతేకాదు ఏసీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఏసీవీలోని యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు యాక్నేకు వ్యతిరేకంగా పోరాడతాయి. దీంతో మీ చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: ఈ విత్తనం మీ చర్మానికి సినిమా హిరోయిన్ వంటి గ్లో అందిస్తుంది.. ముఖానికి మాస్క్ ఇలా తయారు చేయండి..
కార్డియో ఆరోగ్యం..
యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ఎసిటిక్ రక్తపోటును కూడా తగ్గిస్తుంది. హై బీపీ సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఏసీవీ తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా నిర్వహిస్తుంది. రక్తసరఫరాను మెరుగు చేస్తుంది. దీంతో గుండె వ్యాధులు రాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter