Detox Drink: ఉదయం ఖాళీ కడుపున ఈ డ్రింక్‌ తాగితే బరువు సులభంగా తగ్గుతారు..

Detox Drink On Empty Stomach:  ఇలాంటి ఆరోగ్యకరమైన పానియాలు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పునరుజ్జీవనం అందుతుంది. సమతుల ఆహారంగా కూడా పనిచేస్తాయి. అలాంటి ఓ 5 రకాల డ్రింక్స్‌ డిటాక్స్‌ చేస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Aug 31, 2024, 10:38 AM IST
Detox Drink: ఉదయం ఖాళీ కడుపున ఈ డ్రింక్‌ తాగితే బరువు సులభంగా తగ్గుతారు..

Detox Drink On Empty Stomach: బరువు తగ్గాలనుకునేవారికి పరగడుపున తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యం. వారు ఉదయం తీసుకునే ఆహారంతో బాడీ డిటాక్స్‌ అవుతుంది. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా. శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం కూడా. అంతేకాదు కొన్ని రకాల పానియాలు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ డ్రింక్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా ఉంటాయి. దీంతో మీ చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. వెయిట్‌ కూడా ఈజీగా తగ్గిపోతారు. రోజంతటికీ కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది. అంతేకాదు ఇలాంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ వల్ల ప్రాణాంతక వ్యాధులకు కూడా దూరంగా ఉండొచ్చు.

ఇలాంటి ఆరోగ్యకరమైన పానియాలు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పునరుజ్జీవనం అందుతుంది. సమతుల ఆహారంగా కూడా పనిచేస్తాయి. అలాంటి ఓ 5 రకాల డ్రింక్స్‌ డిటాక్స్‌ చేస్తాయి.

దాల్చిన చెక్క నీరు..
దాల్చిన చెక్క నీరు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మెటబాలిజం రేటు పెరుగుతుంది. శరీరంలో నుంచి టాక్సిన్స్‌ బయటకు వెళ్లిపోతాయి. దాల్చిన చెక్క నీటిలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో తేనె వేసి తీసుకుంటే యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు ఉంటాయి. బరువు తగ్గుతారు.

మెంతి నీరు..
మెంతుల్లో ఆల్కలైడ్‌, ఫైబర్‌ ఉంటుంది. ఇది మంచి జీర్ణక్రియకు ప్రేరేపిస్తాయి. ఇందులోయాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడి, కడుపులో అజీర్తి సమస్యకు కూడా చెక్‌ పెడతాయి. బరువు తగ్గేవారికి ఇది మంచి రెమిడీ.

ఇదీ చదవండి:  ఈ ఆకు రసం తెల్లజుట్టును 5 నిమిషాల్లో నల్లగా మారుస్తుంది.. సాయి పల్లవి హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో ఇది తప్పనిసరట..

జిలకర్ర నీరు..
జిలకర్ర నీరు కూడా జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని విడగొట్టడంలో కీలకపాత్రి పోషిస్తాయి. ఖనిజాలు గ్రహించడాన్ని మెరుగు చేస్తాయి. జిలకర్ర నీరు తీసుకోవడం వల్ల రిఫ్రెషింగ్‌ డ్రింక్‌ మాదిరి పనిచేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

ఏబీసీ జ్యూస్‌..
అంటే యాపిల్‌, బీట్‌రూట్‌, క్యారట్‌ జ్యూస్‌. ఇందులో పవర్‌ఫుల్‌ డిటాక్సిఫై, జీర్ణం చేసే గుణాలు కలిగ ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్‌ పేగు కదలికలు తోడ్పడుతుంది. బీట్‌రూట్‌లో కాలేయ పనితీరును మెరుగు చేసే గుణాలు ఉంటాయి. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. క్యారట్‌లో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి దోహదం చేస్తుంది. ఈ కాంబినేషన్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా నిర్వహిస్తాయి.

ఇదీ చదవండి: ఈ విత్తనం మీ చర్మానికి సినిమా హిరోయిన్‌ వంటి గ్లో అందిస్తుంది.. ముఖానికి మాస్క్‌ ఇలా తయారు చేయండి..

నిమ్మకాయ, తేనె..
సిట్రిక్‌ యాసిడ్‌ డైజెస్టీవ్‌ ఎంజైమ్‌ ఉత్పత్తికి ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని విడగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. తేనె నేచురల్‌ ఎంజైమ్‌ శరీరాన్ని క్లెన్స్‌ చేస్తుంది. నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఇందులోని డైరుటిక్‌ గుణాలు ఇందులో టాక్సిన్స్ బయటకు పంపించి, హైడ్రేషన్‌ అందిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

Trending News