COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Apple Fruit Benefits In Telugu: యాపిల్ పండు ప్రతి రోజు తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ C, విటమిన్ A అధిక పరిమాణంలో భిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల కంటి సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ B, విటమిన్ E కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా చేసేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది.   


రోజు ఒక యాపిల్ పండు తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: 

యాపిల్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది తరచుగా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అజీర్ణాన్ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 


ఇది కూడా చదవండి: Egg Pudding Recipe: కోడి గుడ్డుతో ఈ స్వీట్ చేసుకొని తింటే.. మీ బంధు మిత్రులు ఆహా ఏమి రుచి అనడం ఖాయం


గుండె ఆరోగ్యం: 
యాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల రక్తనాళాలు శుభ్రంగా తయారవుతాయి. అంతేకాకుండా గుండె కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గుండె వ్యాధుల ప్రమాదం కూడా సులభంగా తగ్గుతుంది. 


బరువు నియంత్రణ: 
యాపిల్‌లో ఫైబర్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టను నిండుగా చేసేందుకు, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి: Egg Pudding Recipe: కోడి గుడ్డుతో ఈ స్వీట్ చేసుకొని తింటే.. మీ బంధు మిత్రులు ఆహా ఏమి రుచి అనడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


ఎముకలు బలపడతాయి: 
యాపిల్‌లోని బోరాన్ అనే మూలకం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించేందుకు కూడా ఎంతగానో కృషి చేస్తుంది. దీంతో పాటు ఎముకల నాణ్యతను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


చర్మం ఆరోగ్యంగా ఉంటుంది: 
యాపిల్‌లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీని వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా ముడతలు, మచ్చలు ఏర్పడకుండా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.