COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Food To Avoid In Breastfeeding: బిడ్డ పుట్టి తల్లి అయిన తర్వాత మహిళలకు ఎన్నో బాధ్యతలు మొదలవుతాయి. బిడ్డకు ఆహారాన్ని ఇవ్వడం మొదలుకొని శిశువు ఆరోగ్యం వరకు తల్లి కీలక పాత్ర పోషించాల్సిందే..శిశువు జన్మించిన ఆరు నెలల వరకు తల్లిపాలను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో పిల్లలకు పాలు ఇచ్చే స్త్రీలు కూడా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పిల్లలకు తీవ్ర దుష్ప్రభావాలు రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు పాలు ఇచ్చే స్త్రీలు తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 


పిల్లలకు పాలు ఇచ్చే స్త్రీలు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి:
టీ-కాఫీ:

పిల్లలకు పాలు ఇచ్చే మహిళలు తప్పకుండా కెఫిన్‌తో కూడిన పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీని కోసం వీరు టీ, కాఫీ, శీతల పానీయాలు తీసుకోకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లులు  కెఫిన్  అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శిశువు ఆరోగ్యం క్షీణించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీని వల్ల కొందరు శిశువుల్లో విపరీతమైన ఏడుపుతోపాటు నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. 


సిట్రస్ పండ్లు:
పాలిచ్చే తల్లులు నారింజ, నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శిశువుకు కడుపులో చికాకు, డయేరియా, దద్దుర్లు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శిశువు 8 నెలల పాటు పెరిగే వరకు ఈ పై వాటిని తీసుకోకపోవడం చాలా మంచిది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


ట్రాన్స్ ఫ్యాట్:
ప్రస్తుతం చాలా మంది స్త్రీలు శిశువు జన్మించిన 1 నెలలోపే కేకులు, పేస్ట్రీలు అతిగా తసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆహారాల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే శిశువుల DHA పరిమాణం తగ్గే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా మెదడుపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పిజ్జా, బర్గర్లు తినకపోవడం చాలా మంచిది. 


చేపలు:
సీఫుడ్స్‌లో ప్రోటీన్స్‌, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల అధిక పరిమాణంలో లభిస్తాయి. అయినప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని తీసుకునే తల్లుల ఆరోగ్యంతో పాటు శిశువుల ఆరోగ్యం క్షీణించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి